నాగార్జున డెయిరీ సేవాగుణం: ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక చేయూత! మంతెన సుకన్య వివాహానికి రూ. 10,116 ఆర్థిక సహాయం!

bahubalamtv Reporter
bahubalamtv.in

నాగార్జున డెయిరీ సేవాగుణం: ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక చేయూత! మంతెన సుకన్య వివాహానికి రూ. 10,116 ఆర్థిక సహాయం!

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 7,: హుజురాబాద్ మండలం మంతనపల్లి గ్రామానికి చెందిన మంతెన ఐలయ్య గారి కుమార్తె మంతెన సుకన్య వివాహం శనివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరు ప్రభాకర్ రావు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డెయిరీ తరపున సుకన్య వివాహానికి రూ. 10,116 ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా పుల్లూరు ప్రభాకర్ రావు మాట్లాడుతూ, నాగార్జున డెయిరీకి పాలు సరఫరా చేసే ప్రతి గ్రామం నుండి, ప్రతి పాడి రైతు ఆడబిడ్డ వివాహానికి డెయిరీ ద్వారా "పూస్తే మట్టెలు" బదులుగా రూ. 10,116 అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 577 మంది ఆడబిడ్డల వివాహాలకు రూ. 58,36,932 సహాయం అందించామని వివరించారు.

నాగార్జున డెయిరీ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరిస్తూ, పాడి పశువుల కొనుగోలుకు రుణాలు, సాధారణ బీమా, ప్రమాద బీమా, లక్ష రూపాయల పశువుల బీమా, వైద్య సదుపాయం వంటి కార్యక్రమాలు చేపడుతున్నందునే పాడి రైతులు తమను కుటుంబ సభ్యులుగా భావించి తోడుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ డెయిరీ రంగంలో అత్యధిక పాల సేకరణ కలిగిన డెయిరీ నాగార్జున డెయిరీ అని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్ గణేష్ రావు, డెయిరీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్, సీసీఎం మల్లారెడ్డి, సూపర్వైజర్ శ్రీధర్ రావు, స్థానిక ఏజెంట్ నరేందర్ రెడ్డి, గ్రామ రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 7,: హుజురాబాద్ మండలం మంతనపల్లి గ్రామానికి చెందిన మంతెన ఐలయ్య గారి కుమార్తె మంతెన సుకన్య వివాహం శనివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరు ప్రభాకర్ రావు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డెయిరీ తరపున సుకన్య వివాహానికి రూ. 10,116 ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా పుల్లూరు ప్రభాకర్ రావు మాట్లాడుతూ, నాగార్జున డెయిరీకి పాలు సరఫరా చేసే ప్రతి గ్రామం నుండి, ప్రతి పాడి రైతు ఆడబిడ్డ వివాహానికి డెయిరీ ద్వారా “పూస్తే మట్టెలు” బదులుగా రూ. 10,116 అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 577 మంది ఆడబిడ్డల వివాహాలకు రూ. 58,36,932 సహాయం అందించామని వివరించారు.

నాగార్జున డెయిరీ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరిస్తూ, పాడి పశువుల కొనుగోలుకు రుణాలు, సాధారణ బీమా, ప్రమాద బీమా, లక్ష రూపాయల పశువుల బీమా, వైద్య సదుపాయం వంటి కార్యక్రమాలు చేపడుతున్నందునే పాడి రైతులు తమను కుటుంబ సభ్యులుగా భావించి తోడుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ డెయిరీ రంగంలో అత్యధిక పాల సేకరణ కలిగిన డెయిరీ నాగార్జున డెయిరీ అని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్ గణేష్ రావు, డెయిరీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్, సీసీఎం మల్లారెడ్డి, సూపర్వైజర్ శ్రీధర్ రావు, స్థానిక ఏజెంట్ నరేందర్ రెడ్డి, గ్రామ రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !