హుజురాబాద్‌లో గంగోని కుంట భూ కబ్జాలపై ఇరిగేషన్ అధికారుల విచారణ. కబ్జాలు వాస్తవమేనని నిర్ధారణ

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్‌లో గంగోని కుంట భూ కబ్జాలపై ఇరిగేషన్ అధికారుల విచారణ. కబ్జాలు వాస్తవమేనని నిర్ధారణ

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 27:
హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్న గంగోని కుంట శిఖం భూముల కబ్జాలపై ఇరిగేషన్ అధికారులు విచారణ జరిపి, కబ్జాలు వాస్తవమేనని నిర్ధారించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు ఇరిగేషన్ ఏఈలు సునీత,ప్రీతి తెలిపారు. ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ ఫిర్యాదు మేరకు మంగళవారం ఈ విచారణ జరిగింది.
గత 15 సంవత్సరాలుగా సర్వే నంబర్ 2477లో 12 ఎకరాల 16 గుంటలు ఉండాల్సిన గంగోని కుంట శిఖం భూమి ప్రస్తుతం ఆరు ఎకరాలు కూడా లేదని, పక్కనే సొంత భూమి ఉన్న కొందరు వ్యక్తులు తమ సర్వే నంబర్లు వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని కుంట భూమిని ఇష్టానుసారం కబ్జా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
డిమాండ్లు:
ఈ సందర్భంగా కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ పలు డిమాండ్లు చేశారు:
కబ్జాదారులను గుర్తించి వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి.
కబ్జాకు గురైన శిఖం భూములు, వరంగల్ రోడ్డు పక్కన ఉన్న చిలుకావాగు, జమ్మికుంట రోడ్డు పక్కన ఉన్న చెరువుల కట్టుకాలువలను రికవరీ చేయాలి.
రికవరీ చేసిన భూములకు శాశ్వత హద్దులు ఏర్పాటు చేయాలి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మరెక్కడా జరగని విధంగా హుజురాబాద్‌లో జలవనరుల భూకబ్జాలు జరుగుతున్నాయ ని, వీటిని అరికట్టడానికి రెవెన్యూ, ఇరిగేషన్,మున్సిపాలి టీ, గ్రామ పంచాయతీ అధికారులు ఏకకాలంలో సమన్వయం తో పనిచేసేలా జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అప్పుడే కబ్జాలను అరికట్టడం సాధ్యమవుతుం దని పేర్కొన్నారు.
ఈ విచారణలో ఇరిగేషన్ ఏఈలు సునీత, ప్రీతితో పాటు వర్క్ ఇన్‌స్పెక్టర్ సందీప్, లష్కర్లు భాస్కర్, మొగిలి, రవి పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !