రావుల ప్రభాకర్ దంపతుల గొప్ప మనసు: మున్సిపల్ సిబ్బందికి విందు, నూతన వస్త్రాల పంపిణీ.

bahubalamtv Reporter
bahubalamtv.in

రావుల ప్రభాకర్ దంపతుల గొప్ప మనసు: మున్సిపల్ సిబ్బందికి విందు, నూతన వస్త్రాల పంపిణీ.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 25: హుజురాబాద్ పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన ప్రముఖ నవజీవన్ సామిల్ వ్యాపారి రావుల ప్రభాకర్, శ్రీమతి దంపతులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. తమ కుమారుడు రావుల నాగేంద్ర-తారల వివాహ రిసెప్షన్ సందర్భంగా, మున్సిపల్ సిబ్బంది పట్ల వారు చూపిన ఆదరణ అందరి ప్రశంసలు అందుకుంది.

ఘనంగా వివాహ రిసెప్షన్, అపూర్వ ఆతిథ్యం
హుజురాబాద్‌లోని వెంకటసాయి గార్డెన్స్‌లో ఆదివారం రావుల నాగేంద్ర, తారల వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభకార్యాన్ని పురస్కరించుకుని, ప్రభాకర్ దంపతులు తమ గొప్ప మనసును చాటుకున్నారు. పట్టణ పరిశుభ్రతకు నిరంతరం కృషి చేసే మున్సిపల్ పారిశుద్ధ్య, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు సుమారు 150 మందికి పైగా వారి కుటుంబాలతో సహా ఆహ్వానించి,వారికి పెళ్లి విందు భోజనం ఏర్పాటు చేశారు.

నూతన వస్త్రాలతో సత్కారం..

విందు భోజనంతో పాటు,ప్రభాకర్ దంపతులు మున్సిపల్ సిబ్బందికి నూతన వస్త్రాలను కూడా అందజేశారు. మహిళలకు చీరలు, జాకెట్ పీసులు, పురుషులకు ప్యాంటు, షర్టు పీసులను బహూకరించారు. వివాహానికి హాజరైన బంధుమిత్రులు, హుజురాబాద్ పట్టణానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అతిథుల చేతుల మీదుగా ఈ వస్త్రాలను పంపిణీ చేయించారు. సుమారు రూ. 75,000 పైగా విలువైన ఈ వస్త్రాల పంపిణీ ప్రభాకర్ దంపతుల విశాల హృదయాన్ని మరోసారి రుజువు చేసింది.
సామాన్య ప్రజలకు కూడా భారీ విందు
మున్సిపల్ సిబ్బందికి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు, ప్రభాకర్ దంపతులు తమ కుమారుడి వివాహ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని కుమ్మరివాడ, ప్రతాపవాడ, ఫకీర్‌వాడ, శివాజీ నగర్, హనుమాన్ టెంపుల్ ఏరియా, వరంగల్ రోడ్ ఏరియా, విద్యానగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు రెండు వేలకు పైగా ప్రజలను ఆహ్వానించి వారికి కూడా ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. నేటి తరుణంలో వివాహ విందుకు ఆహ్వానించడమే భారంగా భావించే పరిస్థితుల్లో, ప్రభాకర్ దంపతులు చూపిన ఈ ఆదరణ పలువురి ప్రశంసలు అందుకుంది.

కృతజ్ఞతలు, అభినందనలు.

ప్రభాకర్ దంపతుల ఔదార్యానికి మున్సిపల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రభాకర్ దంపతులను అభినందించారు. వారి ఈ మంచి పని సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !