కరీంనగర్ రైతులకు తక్షణమే పచ్చిరొట్టె విత్తనాలు సరఫరా చేయాలి: తెలంగాణ రైతు సంఘం డిమాండ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

కరీంనగర్ రైతులకు తక్షణమే పచ్చిరొట్టె విత్తనాలు సరఫరా చేయాలి: తెలంగాణ రైతు సంఘం డిమాండ్.

బాహు బలంన్యూస్ ఇల్లంతకుంట ప్రతినిధి మే 25:
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా రైతులకు జీలుగ, పెసరు వంటి పచ్చిరొట్టె ఎరువు విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము డిమాండ్ చేశారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సబ్సిడీపై ఈ విత్తనాలను రైతులకు అందించాలని కోరారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉందని, పచ్చిరొట్టె ఎరువులు భూసారాన్ని పెంచి అధిక దిగుబడులకు దోహదపడతాయని రాము గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం మే నెలలో పచ్చిరొట్టె విత్తనాలను సరఫరా చేయడం సరైన సమయమని ఆయన అన్నారు. ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ పలుమార్లు హెచ్చరించినప్పటికీ, జూన్ నెల వస్తున్నా ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అధికారులు పచ్చిరొట్టె విత్తనాలను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, కరీంనగర్ జిల్లా రైతులకు పచ్చిరొట్టె ఎరువుగా ఉపయోగపడే జీలుగ విత్తనాలను సత్వరమే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం తరపున రాము డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !