అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయ నాయకుల హవా – లక్షల వ్యయంతో వాకర్స్ ఎన్నికలు.. ? – నాయకులకు ఎంత… వాకర్స్ కు ఎంత… !! – వాకర్స్ ఎన్నికల్లో కుల రాజకీయం – అన్ని తామై నడిపిస్తున్న నాయకులు.

bahubalamtv Reporter
bahubalamtv.in

అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయ నాయకుల హవా – లక్షల వ్యయంతో వాకర్స్ ఎన్నికలు.. ? – నాయకులకు ఎంత… వాకర్స్ కు ఎంత… !! – వాకర్స్ ఎన్నికల్లో కుల రాజకీయం – అన్ని తామై నడిపిస్తున్న నాయకులు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 16 :
తిలాపాపం తలాపిరికడు అన్న చందంగా ఉంది వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయ నాయకుల పరిస్థితి... అసోసియేషన్ ఎన్నికల్లో సైతం రాజకీయ నాయకులు చేరి అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయం చేస్తున్నారు... అసోసియేషన్ కు కొంత..మాకు కొంత అని ముందే డీల్ చేసుకొని ఓ పదవిని ఏకగ్రీవం చేసినట్లు పట్టణంలో పుకార్లు షికారు కొడుతున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ చేసే వాకర్స్ ను రాజకీయ నాయకుల్లా మార్చి అసోసియేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది...రాజకీయ నాయకుల ఎంట్రీతో వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయాలకు వేదికగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల రూపాయలను వెచ్చించి ఈ ఎన్నికలను ఖరీదైన ఎన్నికలుగా మారుస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, ఉద్యోగులు , వ్యాపారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఉదయం, సాయంత్రం హై స్కూల్ మైదానంలో వాకింగ్ చేస్తుంటారు. గత నాలుగేళ్ల క్రితం నుండి అసోసియేషన్ ఏర్పాటు చేసి 400 మంది సభ్యులుగా చేర్చుకున్నారు. నాటినుండి అసోసియేషన్ నూతన కమిటీ ని ఎన్నుకుంటున్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆ ఎన్నిక చాలా ఖరీదైంది. సభ్యులను మభ్య పెట్టేందుకు విందులతోపాటు అసోసియేషన్ కి డబ్బులు అప్పజెప్పే పరిస్థితి నెలకొని ఉందంటే ఈ ఎన్నికల వెనుక ఎంత రాజకీయం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

- అసలు ఎంత... అసోసియేషన్ కి ఎంత... ?

వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల కోసం అధ్యక్ష పదవి కోసం అసలు పెట్టిన ఖర్చెంత... అసోసియేషన్ కి చేరిన సొమ్ము ఎంత అనే చర్చ పట్టణ వీధుల్లో జోరుగా సాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను నయానో... భయానో ఒప్పించిన నాయకులు తమ వాటా తీసుకున్న తర్వాతే అసోసియేషన్ పేరుతో చెక్కు అందజేసే విధంగా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అసలు పెద్ద మనుషుల వాటా ఎంత ఉంటుందోనని చర్చ జరుగుతుంది.
- రాజకీయ నాయకులదే హవా...

రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేని ఈ అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయాలు ఏంటోనని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.వివిధ పార్టీలకు చెందిన నాయకులు వాకర్స్ గా మారి అసోసియేషన్ ఎన్నికలను రాజకీయాలుగా మార్చేశారు.ఆరోగ్యం కోసం ప్రారంభమైన వాకింగ్ రాజకీయ రొంపిలోకి దిగి అనారోగ్యంగా మారుతుందా... వేచి చూడాల్సిందే.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 16 :
తిలాపాపం తలాపిరికడు అన్న చందంగా ఉంది వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయ నాయకుల పరిస్థితి… అసోసియేషన్ ఎన్నికల్లో సైతం రాజకీయ నాయకులు చేరి అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయం చేస్తున్నారు… అసోసియేషన్ కు కొంత..మాకు కొంత అని ముందే డీల్ చేసుకొని ఓ పదవిని ఏకగ్రీవం చేసినట్లు పట్టణంలో పుకార్లు షికారు కొడుతున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ చేసే వాకర్స్ ను రాజకీయ నాయకుల్లా మార్చి అసోసియేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది…రాజకీయ నాయకుల ఎంట్రీతో వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయాలకు వేదికగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల రూపాయలను వెచ్చించి ఈ ఎన్నికలను ఖరీదైన ఎన్నికలుగా మారుస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, ఉద్యోగులు , వ్యాపారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఉదయం, సాయంత్రం హై స్కూల్ మైదానంలో వాకింగ్ చేస్తుంటారు. గత నాలుగేళ్ల క్రితం నుండి అసోసియేషన్ ఏర్పాటు చేసి 400 మంది సభ్యులుగా చేర్చుకున్నారు. నాటినుండి అసోసియేషన్ నూతన కమిటీ ని ఎన్నుకుంటున్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆ ఎన్నిక చాలా ఖరీదైంది. సభ్యులను మభ్య పెట్టేందుకు విందులతోపాటు అసోసియేషన్ కి డబ్బులు అప్పజెప్పే పరిస్థితి నెలకొని ఉందంటే ఈ ఎన్నికల వెనుక ఎంత రాజకీయం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

– అసలు ఎంత… అసోసియేషన్ కి ఎంత… ?

వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల కోసం అధ్యక్ష పదవి కోసం అసలు పెట్టిన ఖర్చెంత… అసోసియేషన్ కి చేరిన సొమ్ము ఎంత అనే చర్చ పట్టణ వీధుల్లో జోరుగా సాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను నయానో… భయానో ఒప్పించిన నాయకులు తమ వాటా తీసుకున్న తర్వాతే అసోసియేషన్ పేరుతో చెక్కు అందజేసే విధంగా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అసలు పెద్ద మనుషుల వాటా ఎంత ఉంటుందోనని చర్చ జరుగుతుంది.
– రాజకీయ నాయకులదే హవా…

రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేని ఈ అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయాలు ఏంటోనని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.వివిధ పార్టీలకు చెందిన నాయకులు వాకర్స్ గా మారి అసోసియేషన్ ఎన్నికలను రాజకీయాలుగా మార్చేశారు.ఆరోగ్యం కోసం ప్రారంభమైన వాకింగ్ రాజకీయ రొంపిలోకి దిగి అనారోగ్యంగా మారుతుందా… వేచి చూడాల్సిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..