కాట్రపల్లిలో వైభవంగా ఎల్లమ్మ బోనాలు సింగాపూర్ గ్రామస్తులు “జయన్న పౌండేషన్”  శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి. ప్రత్యేక మొక్కులు.

bahubalamtv Reporter
bahubalamtv.in

కాట్రపల్లిలో వైభవంగా ఎల్లమ్మ బోనాలు సింగాపూర్ గ్రామస్తులు “జయన్న పౌండేషన్”  శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి. ప్రత్యేక మొక్కులు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 13:
హుజరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో మంగళ వారం సాయంత్రం ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను గ్రామ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తిన బోనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
ఈ వేడుకలో సింగాపూర్ గ్రామ జయన్న పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి ప్రత్యేకంగా బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఆమె గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు కాపాడాలని భక్తితో మొక్కుకున్నారు.
గ్రామంలోని అన్ని కులాల వారు ఈ బోనాల పండుగలో ఐక్యంగా పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుండి ఒక బోనం చొప్పున తీసి, ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఊరేగింపు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. డప్పు చప్పుళ్లు,భవానీయులైన పంబాల వారి వేషం ధరించి, జమిడిక, పంబ జోడు వంటి వాయిద్యాలతో భజనల నడుమ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ పండుగ గ్రామస్తులందరికీ ఒక ప్రత్యేకమైన సందర్భమని, ఇది వారిలో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జయన్న ఫౌండేషన్ తరపున గ్రామ అభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. ఈ బోనాల పండుగ కేవలం ఒక వేడుక కాదని,ఇది గ్రామ ప్రజలందరి ఆత్మీయ బంధానికి, సంస్కృతికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.
మొత్తం మీద కాట్రపల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాల పండుగ అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరిగింది. గ్రామస్తులందరూ కలిసి అమ్మవారిని కొలుస్తూ, తమ ఊరిని, పంటలను చల్లగా చూడమని ప్రార్థించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !