హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదాల విషాదం: మృతుల కుటుంబాలను పరామర్శించిన సబ్బని వెంకట్

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదాల విషాదం: మృతుల కుటుంబాలను పరామర్శించిన సబ్బని వెంకట్

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ప్రతినిధి మే 1: హుజురాబాద్ మండలంలో ఇటీవల జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ దుర్ఘటనల్లో మృతి చెందిన కుటుంబాలను సిర్సపల్లికి చెందిన సామాజికవేత్త, జెన్ ప్యాక్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఆయన మనోధైర్యాన్ని అందించడమే కాకుండా, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
సింగపూర్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాకేష్ తల్లి మరణించిన విషయం తెలుసుకున్న సబ్బని వెంకట్, వారి స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా, హైదరాబాద్‌లో స్విగ్గి డెలివరీ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బోర్నపల్లికి చెందిన జీవన్ కుమార్ కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించారు.
ఇటీవల జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాజేంధర్‌ను సైతం సబ్బని వెంకట్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పారు. హుజురాబాద్‌లో జరిగిన వేరే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతాపవాడకు చెందిన యువకుడి తల్లిదండ్రులను స్వయంగా కలిసి ఓదార్చారు. ఆ కుటుంబాలకు విద్యా లేదా వైద్యపరమైన అవసరాలు ఏమైనా ఉంటే తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సబ్బని వెంకట్ విలేకరులతో మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇలాంటి విషాద సమయంలో ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, అంతకుముందు సబ్బని వెంకట్ పలు వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !