పెన్షనర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు: చందుపట్ల జనార్దన్

bahubalamtv Reporter
bahubalamtv.in

పెన్షనర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు: చందుపట్ల జనార్దన్

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 29కి
హైదరాబాద్: తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ తీవ్రంగా స్పందించారు. పెన్షనర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలాగే వ్యవహరించడం సరైనది కాదని ఆయన అన్నారు.
పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, జూలై 2023 నుండి నూతన పీఆర్సీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, మార్చి 2024 నుండి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ తక్షణమే మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
పెన్షనర్లు వృద్ధులని, వారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేస్తూ, ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో గరిష్ట పరిమితి లేకుండా నగదు రహిత, నాణ్యమైన వైద్యం పెన్షనర్లకు అందేలా చూడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో టా ప్ర జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు బొం గో నీ వెంకటయ్య, హుజురాబాద్ శాఖ ఉపాధ్యక్షులు చొల్లేటి మల్లారెడ్డి, దొంత హరికిషన్, కట్ట నాగభూషణాచారి, శనిగరం నరేందర్, చీకట్ల సమ్మయ్య, రావి కంటి రామకృష్ణయ్య, గౌరీశెట్టి సాంబయ్య, సయ్యద్ మునీరుద్దీన్, గరిగ చంద్రయ్య, తాటిపాముల కనుకయ్య, మండల వీరస్వామి, గాజర్ల బుచ్చిరాజం, గాజ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !