హుజురాబాద్ కార్మిక శాఖలో పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి నూతన ఇన్ఛార్జ్ అధికారి నియామకం

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్ కార్మిక శాఖలో పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి నూతన ఇన్ఛార్జ్ అధికారి నియామకం

బాహుబలం హుజురాబాద్ ప్రతినిధి సబ్బని వెంకటస్వామి,ఏప్రిల్ 24: హుజురాబాద్ మండల సహాయ కార్మిక అధికారి చందన నెల రోజుల పాటు సెలవులో ఉండటంతో, కార్యాలయంలో పేరుకుపోయిన పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారం కోసం ప్రభుత్వం నూతన ఇన్ఛార్జ్ అధికారిని నియమించింది. కరీంనగర్‌కు చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్‌ఓ) మహమ్మద్ రఫీ గురువారం హుజురాబాద్ సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో ఇన్ఛార్జ్‌ ఏఎల్‌ఓగా బాధ్యతలు స్వీకరించారు.
కొత్త లేబర్ కార్డులు, వివాహ కానుక, మెటర్నిటీ కానుక, సహజ మరణం, ప్రమాదవశాత్తు మరణం వంటి వివిధ కార్మిక సంక్షేమ పథకాలకు సంబంధించిన క్లైమ్‌లు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో పనిచేసిన అధికారి సెలవులో వెళ్లడంతో ఈ పెండింగ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రఫీకి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కధిరే రమేష్ పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న క్లైమ్‌లను త్వరితగతిన పరిష్కరించడానికి నూతన అధికారి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల కార్మికులకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని కార్మికులు ఎదురుచూస్తున్నారు.
ఇన్ఛార్జ్ ఏఎల్‌ఓ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, సాధ్యమైనంత వరకు త్వరితగతిన క్లైమ్‌ల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో కార్మిక శాఖ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని కార్మికులు ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పల్లా తిరుపతి, ఇమ్మడి చక్రపాణి, రుద్రారం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !