సీఐ సృజన్ రెడ్డి ,ని పరామర్శించిన కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకులు.తుమ్మేటి ప్రవీణ్ రెడ్డి..

బాహు బలం న్యూస్ హుజురాబాద్, ప్రతినిధి;
కరీంనగర్ టూ టౌన్ సిఐ కొరిపెల్లి సృజన్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా గురువారం రోజున వారి స్వగ్రామమైన నిర్మల్ జిల్లా కేంద్రం శాంతినగర్ వారి నివాసంలో సృజన్ రెడ్డి కుటుంబ సభ్యులను స్వర్గీయ తుమ్మేటి సమ్మిరెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు తుమ్మేటి ప్రవీణ్ రెడ్డి పరామర్శించారు అనంతరం స్వర్గీయ మధుసూదన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపినారు మధుసూదన్ రెడ్డి మృతి చెందడం వారి కుటుంబానికి తీరని లోటు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు, పుల్యాల వినోద్ కుమార్, బిట్ల రాజు, లాజర్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !