బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్
వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇండ్ల జాగలు ఇవ్వడంతోపాటు అక్రమ కేసులను ఎత్తివేయాలనే లక్ష్యంతో రేపు అనగా… 19.03.2025(బుధవారం) మంచిర్యాల పట్టణంలో ఉదయం 10 గంటల నుంచి డీజేఎఫ్ జర్నలిస్టుల గర్జన సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న విషయం విదితమే. మిత్రులారా..ఈ సభకు డీజేఎఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు పి.విశ్వనాథ్ గారు,జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డిగారు,జాతీయ ప్రధాన కార్యదర్శి బండారి మారుతిగారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోటపలుకుల వెంకట్‌గారు,జాతీయ కార్యదర్శి సబ్బితం లక్ష్మణ్‌తోపాటు ఇతర జాతీయ,రాష్ట్ర నాయకులు,ఇతర జిల్లాల డీజేఎఫ్ నేతలు,సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. కావున ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరై మన హక్కుల కోసం గట్టిగా నినదించడానికి మీరంతా మద్దతు ఇవ్వాల్సిందిగా పేరుపేరునా ఆహ్వానం.
నోట్: కార్యక్రమ విజయవంతానికి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి ,లక్షపేట, జైపూర్, భీమారం ,మందమర్రి కమిటీతోపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్ ,ఐబి ,తాండూర్ జర్నలిస్టు మిత్రులు వందలాదిగా కదిలి కదలి రావాలని మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున పేరుపేరునా కోరుతున్నాం. వీరే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి డీజే ఎఫ్ కుటుంబ సభ్యు లు ,నేతలంతా తప్పక ఐకమత్యంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ..ప్రతీ సభ్యుడికి సూచన.మంచిర్యాల జిల్లా కమిటీ చేస్తోంది.