జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఆర్థిక సహాకారం

బాహు బలం న్యూస్ హుజురాబాద్, ప్రతినిధి:
హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామ కేంద్రంగా గుడిపాటి సరిత-జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గత కొంత కాలంగా నిర్వహిస్తున్న”జయన్న ఫౌండేషన్” తన స్వచ్ఛంద సేవలలో భాగంగా నూతన ఆవిష్కరణలతో ముందుకు వెళ్తున్న సందర్భం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈ రోజు హుజురాబాద్ గర్ల్స్ హైస్కూల్లో ఉదయం 11.30.గంటలకు జరగనున్న ఒక కార్యక్రమంలో హుజురాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి,ఈ నెల 21 నుండి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు “జయన్న ఫౌండేషన్” ఆర్థిక సహాకారాన్ని అందింస్తుండటం చాలా సంతోషకరం.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు లు పాల్గొంటున్నట్టుగా తెలిసింది.జిల్లా కలెక్టర్ ను ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిపాటి జయపాల్ రెడ్డి ఆహ్వానించారు. హుజురాబాద్ మండలంలోని 13 ప్రభుత్వ ఉన్నత పాఠశాలాల్లో పదవ తరగతి చదివి,పరీక్షలు రాయబోతున్న 275 మంది విద్యార్థిని,విద్యార్థులకు”జయన్న ఫౌండేషన్” ఆర్థిక సహాకారాన్ని అందించబోతుంది.
ఒక్కో విద్యార్థికి రోజుకు ఒక్కంటికి 100 రూపాయల చొప్పున పరీక్షలు జరగనున్న 7 రోజులకు 700 రూపాయలచొప్పున జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాధికారి సమక్షంలో అందచేయనుండటం”జయన్న ఫౌండేషన్” కు పేద విద్యార్థుల పట్ల,ప్రభుత్వ విద్య పట్ల ఉన్న మమకారాన్ని తెలియచేస్తుంది.”జయన్న ఫౌండేషన్”మండలంలోని మొత్తం275 మంది పదవ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 700 రూపాయల చొప్పున 1,92,500 రూపాయలను అందించడం విశేషం.
ఈ డబ్బులు విద్యార్థులకు పరీక్షా కేంద్రానికి వెళ్లి వచ్చెందుకు ప్రయాణ ఖర్చులు,బ్రేక్ ఫాస్ట్ కోసం వినియోగించుకునేందుకు మాత్రమే.గత సంవత్సరం కూడా ఈ ఫౌండేషన్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 4000 మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు,పెన్నులు,వాటర్ బాటిళ్లను అందించింది.”చిట్టి నా బొజ్జకు శ్రీరామ రక్ష” ఆంటూ సమాజం నిలువెల్లా స్వార్థంతో నిండిపోయిన నేటి పరిస్థితుల్లో” జయన్న ఫౌండేషన్”తన స్వచ్చంద సేవలో భాగంగా అర్హులైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం.
హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామ కేంద్రంగా గుడిపాటి సరితా-జయపాల్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న”జయ ఫౌండేషన్”ఆధ్వర్యంలో ఇదివరకే మండలంలోని అనేక గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించి,హైదరాబాద్ నుండి నిపుణులైన డాక్టర్లను రప్పించి,ప్రజలకు వైద్య సేవలనుఅందిస్తున్నారు.మండలంలోని అర్హులైన రోగగ్రస్థులను ఫౌండేషన్ తన స్వంత ఖర్చులతో చికిత్సలు జరిపిస్తుండటం విశేషం. హైదరాబాద్ లోని శంకర్ నేత్రాలయం సహాకారంతో”జయన్న ఫౌండేషన్” మండలంలోని ఐదు గ్రామాల్లోని 5,000 మందికి కంటి పరీక్షలు జరిపించింది.500 మందికి హైదరాబాద్ లో కంటి ఆపరేషన్లు జరిపించి,ఫౌండేషన్ వారికి కంటి చూపును ప్రసాదించింది.
“జయన్న ఫౌండేషన్”ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి జరగాలి.
మానవీయ సేవాదృక్పధంతో”జయన్న ఫౌండేషన్ “ను ముందుకు నడిపిస్తున్న శ్రీమతి గుడిపాటి సరితా-జయపాల్ రెడ్డిలు మరిన్ని సేవలు అర్హులైన పేదలకు అందించాలని కోరుకుందాం.
గుడిపాటి సరితా-జయపాల్ రెడ్డి లకు అభినందనలు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !