కుల గణన చేసి వర్గీకరణ అమలు చేయాలి.-ఎస్సి ఉపకులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు.

సబ్బనివెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్
ఆగస్టు 02:
ఎస్సీ కులాలను కుల గణన చేసిన అనంతరమే వర్గీకరణ అమలు చేయాలని ఎస్సీ ఉపకులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు . ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఉప కులాలు 2011 జనాభా లెక్కల ప్రకారం 30 లక్షల వరకు ఉంటారని ,ప్రస్తుత జనాభా రెట్టింపు అవుతుందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎస్సీ కులాల ను వర్గీకరణ చేస్తే ఉపకులాలు నష్టపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్సి వర్గీకరణ పలాలు ఉప కులాలకు అందాలంటే తక్షణమే కుల గణన చేయాలని కోరారు.అలాగే అంబేద్కర్ అభయాస్తం లో భాగంగా ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించి ఉప కులాల కార్పొరేషన్ ను విస్మరించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉప కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా బైరి వెంకటేశంను నియమించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో కానుకూర్తి రాజేష్, తూర్పాటి లింగయ్య, చింతల అంజి, చింతల సతీష్ వర్మ, చంద్ర గిరి సందీప్, తూర్పాటి రాజు, తూర్పాటి రామచంద్రం, రేవెల్లి వెంకటేష్ , వానరాశి జాన్, తూర్పాటి సాయికుమార్, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !