డైరీ కి వచ్చి వీక్షించండి తప్పులుంటే శిక్షించండి -నిరాధారణ ఆరోపణలు చేయకండి.. -ఆదాయం ముఖ్యం కాదు మాకు ఆరోగ్యం ముఖ్యం..

హుజరాబాద్/జూలై 24(బాహు బలం న్యూస్): హుజురాబాద్ లోని పరకాల క్రాస్ రోడ్ లో గల నాగార్జున డైరీ పై కొంతమంది కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిందలు వేస్తున్నారని ఎవరైనా సరే డైరీకి వచ్చి పాల ఉత్పత్తులను పరీక్షించి తప్పులుంటే శిక్షించాలంటూ నాగార్జున డైరీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్ అన్నారు. బుధవారం హుజరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నాగార్జున డైరీ ఏర్పాటు చేసి మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరు ప్రభాకర్ రావు ఎంతోమంది యువకులతో పాటు దళితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకున్నారని,తమ ప్రజలకు అందించే పాలను ప్రతినెల శాంపిల్స్ ల్యాబ్ కు పంపించి వారి ఆదేశాల ప్రకారమే స్వచ్ఛమైన పాలన అందిస్తున్నామన్నారు .ప్రజలకు అందించే పాల ఉత్పత్తుల్లో ఎక్కడ రాజీపడ లేదని అన్నారు.తమ డైరీలో పనిచేసే వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నామ ని,తమకు పాలు పోసి రైతు కుటుంబంలో ఆడకూతురు వివాహం జరిగితే వారికి 5000 రూపాయల ఆర్థిక సాయం పాడి పశువు మరణిస్తే 40 వేల రూపాయలు ,వాళ్ళ అమ్మక పుదారులు మరణిస్తే లక్ష రూపాయల ఆర్థిక సాయం తోపాటు డైరీలో పనిచేసే ఉద్యోగులకు పిఎఫ్,ఎస్సై ఎల్ఐసి లాంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు.గతంలో తిప్పారపు సంపత్ ప్రజా ఆరోగ్య సమితి పేరిట పలు అంశాలతో కూడిన లెటర్ ప్యాడ్ ను అందించి 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో డైరీ మూసివేయాలని హెచ్చరించారని అన్నారు.అప్పుడు తాను స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నా నని దాని ఖర్చుల నిమిత్తం రెండు లక్షల ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారని అన్నారు.దానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అతన్ని పై కేసు నమోదు చేసి జైల్లో వేశారని అదే కక్ష సాధింపులో భాగంగా తమ డైరీ పై ఇలాంటి తప్పుడు ప్రచారాలతో పాటు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.నాగార్జున డైరీ తో సుమారు రెండు లక్షల మంది పాలను తాగుతున్నారని అలాంటి పాలపై తాము పూర్తి జాగ్రత్తతో పనిచేస్తామన్నారు.ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని అన్నారు.పాల నాణ్యతను తెలుసుకోవడానికి ఎప్పటి కప్పుడు కొత్త మిషన్లను ఏర్పా టు చేస్తూ ప్రజలకు స్వచ్ఛమైన పాలను అందిస్తున్నామని అన్నారు.నాగార్జున డైరీ పాలపై ఎవరికైనా అపోహలు ఉంటే తమను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని పూర్తి వివరాలు వారికి ఇస్తామని,అవసర మైతే ప్లాంట్ లో పాల తయారీని చూపిస్తామని అన్నారు.ఇప్పటికే డైరీ పై ఆరోపణలు చేసిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశామని అన్నా రు. నాగార్జున డైరీ ప్రజల ఆదరణతోటే ఇంత గొప్పగా ఎదిగిందని రాబోయే రోజుల్లో మరింత ఆదరణ చూపి స్తారని ఆశిస్తున్నామన్నారు.ఈ సమావేశంలో నాగార్జున డైరీ సిబ్బంది.రజనీ, శ్రీకాంత్ రెడ్డి,శ్రీనివాస్,సంతోష్, శివ కుమార్,బిక్షపతి,తిరుపతి,రాహుల్,రాజేశ్వరరావు,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..