కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా తెలంగాణకు కెసిఆరే శ్రీరామరక్ష అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్, బిజెపి లను నిలదీస్తాం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్;
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన బడ్జెట్ ని ఉద్దేశించి మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీలో తిరుగుతూ సోషల్ మీడియాలో హెక్టీక్ డే అని పెట్టారని,హెక్టిక్ డే అని తిరుగుతూ కనీసం సెప్టిక్ ట్యాంక్ కట్టే పైసలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు.మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 15 వేల కోట్లు బడ్జెట్లో తీసుకు వెళ్లారని, కనీసం తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తేకపోవడం సిగ్గుచేటని,తెలంగాణ ప్రజలు బిజెపికి ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గుండుసున్నాచూపిం చారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్,బిజెపి పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో చరో 8 గెలుచుకున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై వివక్ష చూపిస్తే కనీసం ఖండించకుండా ఏమి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పంజాబ్ కు బడ్జెట్లో అన్యాయం జరిగిందని వారి ఎంపీలు అక్కడే నిరసన తెలిపారని,తెలంగాణ ఎంపీలు మౌనం ఎందుకు పాటించారని అన్నారు.తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని తెలంగాణకు కెసిఆరే శ్రీరామరక్ష అని అన్నారు.బడ్జెట్ విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కచ్చితంగా కాంగ్రెస్ బిజెపి లను నిలదీస్తామని అన్నారు.ఇప్పటికైనా రెండు పార్టీల ఎంపీలు డ్రామాలు ఆపి తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలని అన్నారు.తెలంగాణ వ్యాప్తంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు .అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రుణమాఫీ రెండు లక్షలు ఏకకాలంలో చేశామని పేపర్ యాడ్స్ ఇచ్చుకుంటున్న కాంగ్రెస్ను నిలదీస్తామని అన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఎవరికి ఇచ్చారో చూపించాలని,లక్ష రూపాయల రుణమాఫీలోనే చాలా మందికి రుణ మాఫీ కాలేదని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..