బాహుబలం న్యూస్ హుజురాబాద్ మే 4:గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుశనివారం రాత్రి హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు చేరుకు న్నారు.ఆయన స్థానిక ఎమ్మెల్యే యువనేత పాడి కౌశిక్ రెడ్డి నివాసంలో బస చేశారు.ఆదివారం ఉదయం వీణవంకలో జరిగే గులాబీ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ పాల్గొంటా రు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం కెసిఆర్ ప్రచారాన్ని 48 గంటల పాటు నిషేధించింది.ఈ మేరకు ఆయన ప్రచారం ఆపివేశారు. నిజానికి రెండో తేదీ రాత్రి జమ్మికుంటలో జరిగే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. ఎన్నికల సంఘం నిషేధంతో ఆ కార్యక్రమం రద్దయింది.కానీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్టుబట్టిన మీదట ఆయన వీణవంక కార్యక్రమానికి ఒప్పుకున్నట్లు తెలిసింది.ఇక్కడ రోడ్ షో బదులు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇప్పటికే జమ్మికుంటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అలాగే శుక్రవారం రాత్రి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ రోడ్ షో హుజురాబాద్ లో జరిగింది.బి ఆర్ ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పలుచోట్ల నియోజకవర్గం లో ప్రచారంలో పాల్గొన్నారు.కానీ బి.ఆర్.ఎస్ అధినేత కెసిఆర్ వీణవంకకు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
క్రూసేడర్ కౌశిక్
రాజకీయ నేపథ్యం ఇదీ..
వీణవంక మండల కేంద్రానికి చెందిన పాడి సాయినాథ్ రెడ్డి శైలజ దంపతుల పాడి కౌశిక్ రెడ్డి క్రికెట్ నేపథ్యం నుండి వచ్చారు.హైదరాబాద్ రంజి క్రికెటర్ గా రాణించారు. హైదరాబాదులో విద్యాభ్యాసం చేశారు.తదనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ ఆరంగేట్రం చేశారు.మొదటిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 60 వేల వోట్లు సాధించారు.అప్పటి మంత్రి ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయినప్పటికీ నిరాశ చెందలేదు.కానీ అనూహ్యంగా ఈటల రాజేందర్ 2021లో గులాబీ పార్టీ నుండి నిష్క్రమించడంతో కౌశిక్ కాంగ్రెస్ నుండి గులాబీ పార్టీలో చేరారు.ఆనాడు వచ్చిన ఉప ఎన్నికల టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ కౌశిక్ కు టికెట్ దక్కలేదు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇవ్వగా ఆయన ఓటమి చెందారు.ఈ పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్ ఆయనను హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంతోపాటు ఎమ్మెల్సీ,మండలి విప్ పదవులు కట్టబెట్టారు. దీంతో ఆయన జనంలోకి చొచ్చుకు వెళ్లారు. మొదటి నుండి కౌశిక్ గుర్తింపు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీ, విప్ పదవులతో ఆయన రాజకీయంగా నిలదొక్కుకున్నారు. అయినా ప్రజాక్షేత్రంలో గెలవాలనే తపన ఆయనకు ఉండేది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ అధిష్టానం కౌశిక్ ను హుజురాబాద్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆ ఎన్నికల్లో ఈటల రాజేందర్ వరుస విజయాలకు కౌశిక్ బ్రేక్ వేసి సంచలనం సృష్టించారు. ఎవరు ఊహించని రీతిలో సుమారు 20వేల మెజారిటీతో కౌశిక్ గెలుపొంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే సంచలనం సృష్టించారు. ప్రజాక్షేత్రంలో గెలుపొందాలనే కౌశిక్ కల 2023 ఎన్నికల్లో నెరవేరింది.నిజానికి బి ఆర్ ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే మరింత ప్రజాసేవ చేసేందుకు కౌశిక్ కు మంచి అవకాశం లభించేది.మంత్రి పదవి కూడా వచ్చేదని పలువురు చెప్తుంటారు.అయినా నిరాశ చెందకుండా కౌశిక్ ప్రజాక్షేత్రంలో నిరంతరం దూసుకుపోతున్నారు.
అదరడు.. బెదరడు.. కౌశిక్ స్టైలే వేరు!
సహజంగానే దూకుడు స్వభావం కలిగిన నేత కౌశిక్.. ఆయన ఎలాంటి రాజకీయ పరిస్థితుల కైనా అదరడు.. బెదరడుసమస్యల్లోకి చొచ్చుకు వెళ్తాడు. ధైర్యంగా ముందుకు వెళ్తాడు ఆనే పేరుంది అనతి కాలంలోనే కౌశిక్ హుజురాబాద్ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షించారు. పలు రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు.రాజకీయాల్లో అయనది విభిన్నమైన శైలి.ప్రతినిత్యం ప్రజలతో మమేకం కావడం, యువతలో ఉత్సాహం నింపడం,ప్రత్యర్థి పార్టీలపై అదను చూసి విమర్శలు గురిపెట్టడం,వివాహాది శుభకార్యాలకు హాజరు కావడం,అందరినీ నవ్వుతూ పలకరించడం, పరామర్శలకు వెళ్లడం, హృదయాలను కదిలించే విధంగా బాధితులను హత్తుకోవడం,మృతుల పాడెలు మోయడం, అంత్యక్రియలో పాల్గొనడం వంటి ద్వారా కౌశిక్ తన ఇమేజిని మరింత పెంచుకున్నారు.ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి క్రేజీ ఉంది.కౌశిక్ కు సోషల్ మీడియాలో,మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సినిమా హీరోలా ఆయన అందరిని ఆకట్టు కుంటున్నారు.ఎవరికి ఆపద ఉన్న కౌశిక్ వస్తారనే పేరు తెచ్చుకున్నారు.తనకోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకో వడం,అధికారులతో సమస్యలపై సీరియస్ గా మాట్లాడడం, సమస్యలపై ఎవరు వచ్చినా స్పందించడం, సందర్శకులను నేరుగా కలవడం,వేగంగా నిర్ణయాలు తీసుకోవడం,వాటిని అమలు చేయడం,ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, కార్యకర్తలతో నాయకులతో నేరుగా మాట్లాడడం వంటివి కౌశిక్ చేస్తుంటారు.మొదట్లో అనుకోని రీతిలో కొన్ని వివాదాలు కౌశిక్ పై చెలరేగి మీడియాలో,సోషల్ మీడియాలో నెగటివ్ చర్చ జరిగేది.కానీ తర్వాతి కాలంలో కౌశిక్ తన మెచ్యూరిటీని ప్రదర్శించారు.ఇటీవల కాలంలో తనపై వివాదాలు రాకుండా చూసుకుంటున్నారు.సందర్భోచితంగా మాట్లాడుతూ ప్రత్యర్థులను,ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెడుతున్నారు. ఒక్కోసారి రాజకీయ ఎజెండాలను ఆయన సెట్ చేస్తున్నారు.రాష్ట్ర పార్టీ కూడా ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు కౌశిక్ ను ఉపయోగించుకుంటోంది. దానం నాగేందర్ పార్టీ మారిప్పుడు స్పీకర్ ను కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు. అలాగే పలు సందర్భాల్లో తెలంగాణ భవన్లో, కరీంనగర్లో ప్రెస్మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీపై,బిజెపిపై విమర్శల వర్షం కౌశిక్ కురిపించారు. ప్రస్తుతం హుజూరాబాద్ లో తిరుగులేని రాజకీయనేతగా కౌశిక్ చలామణి అవుతున్నారు.నాటి డైనమిక్ లీడర్ ముద్దసాని దామోదర్ రెడ్డి వలె ప్రజాకర్షణ కలిగిన నేతగా కౌశిక్ ప్రజలను మరిపిస్తున్నారని,తన మార్క్ డైనమిజాన్ని ప్రదర్శిస్తున్నారని,ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని,గులాబీ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు తర్వాత అంత దూకుడు కలిగిన నేతగా కౌశిక్ పేరు తెచ్చుకుంటున్నా రని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కౌశిక్ నేర్చుకున్నారని,ఒక సైన్యంలా పని చేస్తాడని,ధైర్యంగా ముందుకు వెళ్తాడని,
కార్యకర్తలకు భరోసా ఇస్తాడని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యా నించారు.కౌశిక్ మంచి ఆర్గనైజర్.జట్టును ఎలా నడిపించాలో అతనికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఉప యోగించుకోవాలో ప్రతికూల పరిస్థితులను ఎలా అనుకూలం గా మలుచుకోవాలో తెలుసు సెంటిమెంటును ఎలా రగిలించా లో తెలుసు అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ మూడో స్థానం అని ప్రచారం చేసినా 20వేల ఓట్ల మెజారిటీ తో గెలిచి సీనియర్ నేత ఈటలను ఓడించి తనేంటో తాను నిరూపించుకున్నారు అని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యా నించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ కోసం..
పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గులాబీ పార్టీ కి మెజారిటీ తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో స్థానికంగా రాజకీయంగా భిన్న పరిస్థితులు ఉన్నాయి.2004 నుండి ఇక్కడ ప్రతి ఎన్నికల్లో బి ఆర్ ఎస్ తరపున ఈటెల రాజేందర్ తన ప్రభావం చూపేవారు.ఆయన 2023 ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రస్తు తం మల్కాజిగిరి స్థానం నుండి పోటీ చేస్తున్నారు.దీంతో ప్రస్తుతం ఆయన లేకుండానే పార్లమెంట్ ఎన్నికలు జరుగు తున్నాయి.ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందున బలమైన బిఆర్ఎస్ నేతలను కౌశిక్ కాపాడుకుంటూ వస్తున్నా రు. ఒకవైపు ఈటల లేకపోవడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం కౌశిక్ రాజకీయంగా మరిం త బలమైన శక్తిగా ఎదిగేందుకు దోహదపడుతోంది.ఎన్నికల్లో ఎలాగైనా బి ఆర్ ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మెజారిటీ చూపించాలనే వ్యూహం ఎత్తుగడలతో కౌశిక్ పనిచేస్తున్నారు. గ్రామ గ్రామాన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తూ.కేంద్రంలో ఉన్న బిజెపి పై,రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఆరు గ్యారెం టీల అమలుపై విమర్శలు చేస్తున్నారు.సీఎం కేసీఆర్ నాయక త్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను,రైతు సంక్షే మకార్యక్రమాలను ఆయన గ్రామగ్రామాన వివరిస్తున్నారు గ్రామ గ్రామాన డోర్ టు డోర్ ప్రచారంతో పాటు. పోల్ మేనేజ్మెంట్ పకడ్బందీగా నిర్వహించి.గులాబీ పార్టీ కి మెజారిటీ చూపిం చి తన సత్తా ఏమిటో చాటాలని కౌశిక్ భావిస్తున్నట్టు తెలు స్తోంది.ఏది ఏమైనా వర్తమాన రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కౌశిక్ ముందుకువెళ్తున్నారు.ప్ర స్తుతం వీణవంక లోని ఆయన నివాసానికి కేసీఆర్ రావడం అక్కడ బస చేయడం,ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావడం రాజకీ య వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.










