బాహుబలం న్యూస్:హుజరాబాద్
స్వదేశీ భారతీయ జనతా పార్టీకి, విదేశీ యుడు స్థాపించిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎన్నికల పోరు జరుగుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. ఆదివారం హుజరాబాద్ నియోజకవర్గంలో ఎన్నిక ల ప్రచారంలో భాగంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ,ఎస్టీలను భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంటూ విష ప్రచారం చేస్తోందన్నా రు.వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉండటంతో వారి ద్రుష్టిని మళ్లించేందుకు ఆడుతున్న రాజకీయ డ్రామా అని విమర్శంచారు. రాజ్యాంగాన్ని తూ.చ తప్పకుండా అమలు చేసే పార్టీ బీజేపీ అని, ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్లను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం వ్యతిరేకమైనప్పటికీ.సుప్రీంకోర్టు తీర్పులను సైతం ధిక్కరించి ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. బీజేపీ అధికారం లోకి వస్తే రాజ్యంగం ప్రకారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి… వాటిని ఎస్సీ,ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు పంచి తీరుతామని ప్రకటించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కేసీఆర్ ప్రకటిస్తే కనీసం నోరు మెదపని కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ ను అడుగడుగునా అవమానిం చారన్నారు. అంబేద్కర్ ను ఓడించడంతో పాటు అంబేద్కర్ చనిపోతే ఆయన పార్దివ దేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబయికి పంపించిన నీచమైన పార్టీ కాంగ్రెస్సేనని మండిపడ్డారు. మోదీయే అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్ లో తాను ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. మోదీ ప్రభుత్వ యొక్క విజయాలను, ఎంపీగా చేసిన అభివృద్ధి ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదు అని, ప్రజలు కష్టాల్లో ఉంటే భరోసా ఇవ్వలేదని, బీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్ ఏనాడూ జనం గురించి పట్టించుకోలేదు అని, లేఖలు రాసుడు, హైదరాబాద్ లో ఉండటం తప్పసాధించింది ఏమీ లేదు అన్నారు. కరీంనగర్..వరంగల్, ఎల్కతుర్తి..సిద్దిపేట రోడ్డు విస్తరణ నిధులు ఎవరి హయాంలో వచ్చాయని ప్రశ్నించా రు.ఎవరి హయాంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా తెలియదని అన్నారు..

తాను లోకల్ వ్యక్తినని టిఆర్ఎస్ అభ్యర్థి నాన్ లోకల్ వ్యక్తి అని అన్నారు.కరీంనగర్ కు కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తే నోరు విప్పలేదని, కరీంనగర్ ప్రజలు బాధల్లో ఉంటే ఏనాడూ పట్టించుకోలేద ని,కేసీఆర్ కు దోచి పెట్టడం, తన కుటుంబానికి దాచి పెట్టడం తప్ప సాధించింది ఏమీలేదని అన్నారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే ఎన్నడైనా కెసిఆర్ ను కలిసి రైతులకు సాయం చేయించారని ప్రశ్నించారు.ఇప్పుడు కూడా రైతులు పంట నష్టపోయి కొందరు, వడ్లు కొనుగోలు కేంద్రా ల్లో మరికొందరు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు లేఖలు రాయలేదన్నా రు.కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల ను ఎందుకు అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలనెలా రూ.2500 లు ఇచ్చారని, రైతులకు రూ.500 బోనస్ ఇచ్చారా అని, ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇచ్చారా అని, ఇల్లు లేనోళ్లకు ఇంటిజాగా, రూ. ఇచ్చారా అని, విద్యార్థులకు రూ. 5లక్షల భరోసా కార్డు ఇచ్చారా అని, వృద్ధులకు, వితంతవులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నారని ప్రశ్నించారు.మరి ఏం చూసి కాంగ్రెస్ కు ఓటేయాలి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










