అపరభగీరధుడు తొలి సీఎం కేసీఆర్ కు అండగా నిలవండి -బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి -బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజలింగారెడ్డి

బాహుబలం న్యూస్ ఏప్రిల్26 హుజూరాబాద్:నాడు సమైక్య రాష్ట్రంలో నీటి బిందెలు, నీళ్ల ట్యాంకర్లు, ఫ్లోరైడ్ సమస్య, ఆడబిడ్డలు నీళ్లు మోయడం జరిగేవని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ లాంటి గొప్ప పథకం తీసుకువచ్చి ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి అందరికీ సురక్షిత మంచినీరు ఇచ్చి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న అపరభగీరధుడు తొలి సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజలింగారెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడీ కొట్టించిందన్నారు. చల్లగా ముందుకుపోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి.. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలన్నారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు రాలేదు గానీ, కాంగ్రెసోళ్ల లూటీలు మొదలైనయ్ అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువత ఓట్లు దండుకొని నేడు మేము భృతి గురించి హామీ ఇవ్వలేదని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కల్లాల వద్ద ధాన్యం కుప్పలను పెట్టి రైతులు రోజుల తరబడి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. కొందరు రైతులకు నేటికి రైతుబంధు రాలేక అప్పులు చేసి తిరిగి కట్టలేక అరిగోస పడుతున్నారని అన్నారు. కాల్వల్లో నీళ్లు లేక ఆలస్యంగా వేసిన పంటలకు చివరి తడి సాగునీరు అందక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని, గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీరు లేక ప్రజలు అరిగోస పడుతున్నారని అన్నారు. నామ మాత్రంగా పలుచోట్లా కొన్న పంటకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని రైతులు వాపోతుండగా, కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుండగా ఇంకా కాంగ్రెస్ కు ఓటెందుకు వెయ్యాలో చెప్పాలన్నారు. ఉద్యమనేతగా కేసీఆర్ నాడు 2003 ఆగస్టు 25 నుంచి ఆగస్టు 30 వరకు కోదాడ నుంచి హాలియా వరకు చేపట్టిన పాదయాత్రను తాజా బస్సుయాత్ర గుర్తుకు తెచ్చిందన్నారు. నాడు పిడికిలెత్తి తమ వెంట నడిచిన కేసీఆర్ కు రైతులు జేజేలు
పలుకుతున్నరని, కేసీఆర్ పాలనను గుర్తుకు తెచ్చుకుని సంబరపడుతున్నారన్నారు. పదేండ్లలో రెండేసి పంటలు ఎలా పడించుకోగలిగామో, ఇప్పుడు తొలిపంటకే ఎలాంటి కష్టాలు పడుతున్నామో గుర్తు చేసుకోవాలన్నారు. రెండు దశాబ్దాల క్రితం కేసీఆర్ పాదయాత్ర చేసిన తర్వాత తమ బతుకులు బాగుపడ్డట్టుగానే.. కళతప్పిన తమ బతుకులు ఇప్పుడు మళ్లీ కేసీఆర్ బస్సు యాత్రతో గాడినపడతాయని ప్రజలు ఆశగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. వచ్చే నేల(మే)2న సాయంత్రం హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో సాయంత్రం రోడ్ షోకు పార్టీ అధినేత కేసీఆర్ వస్తారని గుర్తు చేశారు. రోడ్ షో అనంతరం వీనవంకలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలతో మాట్లాడి స్థానిక పరిస్థితులు అడిగి తెలుసుకుంటారని, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, తరలి వచ్చి కేసీఆర్ బస్సు యాత్రను విజయవంతం చేయాలన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజారీటీతో ఎంపీగా గెలిపించాలని రాజలింగారెడ్డి పిలుపు నిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..