బాహుబలం ఏప్రిల్ 25 హుజురాబాద్
హుజురాబాద్ లో గత మూడు సంవత్సరాలుగా సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ఎండి మక్సుద్ అలీ స్థానంలో ఇంచార్జి సబ్ రిజిస్టార్ గా సదాశివ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
అసలేం జరుగుతోంది?
హుజురాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై ఇటీవల తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ అనుమతి పొందని లేఅవుట్లలో ని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు వివాదాస్పదమైన చెరువులు, కుంటల శిఖం భూములు, ఎస్సారెస్పీ కాలువల భూములు, అసైన్డ్ భూములు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చా యి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు సబ్ రిజిస్టర్ కార్యాలయం కేంద్రంగా మారిందనే ఆరోపణ లు వచ్చాయి. అలాగే రియల్ బ్రోకర్లు ఎలా చెప్తే అలా సబ్ రిజిస్ట్రార్ నడుచుకున్నాడని విమర్శలు వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్ ప్రతి రోజు అనధికార సంపాదన లక్షల్లోనే ఉన్నట్టు గా కూడా ప్రచారం జరిగింది. అన్ని డాక్యు మెంట్లు సరిగ్గా ఉన్నప్పటికీ కొనుగోలు దారు లను తిప్పించుకోవడం, ఆమ్యామ్యాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్లు చేయడం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక్కో రిజిస్ట్రేషన్ కు లేఅవుట్లో అయితే ఇంత.. నాన్ లేఅవుట్లో అయితే ఇంత.. అన్నట్టుగా ఫిక్స్ చేసి మరి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కార్యాలయ ఉద్యోగులను, డాక్యుమెంట్ రైటర్లను ఇందుకు పావుగా వాడుకున్నట్టు సమాచారం.
తుమ్మేటి గరం గరం?
హుజురాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై స్థానిక నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నేత తుమ్మేటి సమ్మిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజి కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు ఆధారంగానే సబ్ రిజిస్టార్ పై రహస్య నివేదికను హైదరాబాద్ ఉన్నతాధికారులు తెప్పించుకున్నట్టుగా సమాచారం.

కలెక్టర్ విచారణ కూడా కారణమే?
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఔట్ల వ్యాపారం జరుగుతోందని దీనికి సబ్ రిజిస్ట్రార్ ముఖ్య కారణమని పలు ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెళ్లాయి. అలాగే హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లపై విచారణ చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసి కలెక్టర్ కు పంపింది. దీంతో కలెక్టర్ ఈ విషయమై విచారణకు ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ వ్యవహారం వల్లే అక్రమ లేఅవుట్లు నడుస్తున్నాయని మునిసిపల్ అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదించారు. అక్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు ఇకముందు చేయొద్దని మున్సిపల్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి లేఖ కూడా రాశారు. హుజురాబాద్ లో అక్రమ రియల్ దందాపై ఇటీవల పత్రికల్లో వార్తలు వచ్చాయి.
దడ పుట్టించిన ఏసీబీ దాడి?
హుజురాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఇటీవ ల హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ 20వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. హుజు రాబాద్ లోని వివిధ ప్రభుత్వ కార్యాలయా లపై ఏసీబీ నిఘా పెట్టినట్టు ప్రచారం జరిగిం ది. ఇది కూడా సబ్ రిజిస్ట్రార్ సెలవులో వెళ్లేందుకు కారణం అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకవైపు అక్రమ లే అవుట్ల విషయం లో సర్ రిజిస్ట్రార్ కార్యాలయం పై విమర్శ లు రావడం, అవినీతి అడ్డగోలుగా జరుగు తోందని ప్రచారం జరగడం, మున్సిపాల్ కౌన్సిల్ తీర్మానం చేసికలెక్టర్ విచారణ కోరడం, కలెక్టర్ విచారణకు ఆదేశించడం, హుజురాబాద్ ఆర్డిఓ కి వ్యవహారంపై విచా రణ చేయడం, మునిసిపాలిటీ అధికారులు కూడా నాన్ లేఅవుట్ వెంచర్ల విషయమై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి లేఖ పంప డం, మరోవైపు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ పై ఏసీబీ దాడి జరగడం. వీటన్నింటి నేప థ్యంలోనే సబ్ రిజిస్ట్రార్ మక్సూద్ అలి దీర్ఘకాలిక సెలవులో వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న సదాశివ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించడం చర్చనీయాంశం అయింది. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ సదాశివ అక్రమ రిజిస్ట్రేషన్లు అరికట్టాలని, రియల్ బ్రోకర్ల భరతం పట్టాలని, హేతుబద్ధంగా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలని, అమ్మకందారులు, కొనుగోలుదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, కార్యాలయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని అరికట్టాలని, దళారులను దూరం పెట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ గా మక్సుద్ అలీ మూడేళ్ల కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్ లపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని, అక్రమ రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయాలని, తప్పులు జరిగినట్టు వెల్లడయితే కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.










