బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 15:
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ప్రముఖ సామాజికవేత్త నలబాల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎస్సార్ (SR) కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల నుంచి కరీంనగర్ రోడ్డు మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్లకార్డులతో చైతన్యం
ఈ ర్యాలీలో సామాజికవేత్త నలబాల వేణుగోపాల్ ముఖ్య భూమిక పోషించి ‘గంజాయి వద్దు – ఆరోగ్యం ముద్దు’, ‘యువత మేలుకో – మత్తు వదులుకో’ (Say No to Drugs) ప్లకార్డులను స్వయంగా ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించి తిరిగి కళాశాలకు చేరుకున్నారు. విద్యార్థుల్లో దేశభక్తితో పాటు సామాజిక స్పృహ పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కళాశాల చైర్మన్ భూంపల్లి అనూష్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.











