అర్హులకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లివ్వాలి… హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో కేటాయింపులపై బీజేపీ ఆగ్రహం .అక్రమాలపై పోరాడతామని గంగాడి కృష్ణారెడ్డి వెల్లడి..

bahubalamtv Reporter
bahubalamtv.in

అర్హులకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లివ్వాలి… హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో కేటాయింపులపై బీజేపీ ఆగ్రహం .అక్రమాలపై పోరాడతామని గంగాడి కృష్ణారెడ్డి వెల్లడి..

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,: హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. నిజమైన నిరుపేదలను పక్కనబెట్టి, కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న అనర్హులకు ఇళ్లను కట్టబెట్టారని మండిపడ్డారు. బుధవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఫ్లోర్, కౌన్సిలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మున్సిపల్ పాలన అవినీతికి అడ్డాగా మారిందని దుయ్యబట్టారు. అర్హులైన పేదల హక్కులను కాలరాస్తున్న అధికారుల తీరుపై బీజేపీ చూస్తూ ఊరుకోదని, బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల విజయ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు, కౌన్సిలర్లు కొలుగురి సుమలత, దామెర అనూష, పంజాల మనోజ్, కొండ ప్రశాంతి, మంచికట్ల మురళి, దామెర అనురాగ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !