ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకూ ‘ఓవర్సీస్‌’ వర్తింపజేయాలి సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలి ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్‌.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకూ ‘ఓవర్సీస్‌’ వర్తింపజేయాలి సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలి ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్‌.

బాహు బలంన్యూస్ కరీంనగర్‌ సెప్టెంబర్ 13:విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేద (ఈడబ్ల్యూఎస్‌) విద్యార్థులకూ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని వర్తింపజేయాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
​విదేశీ విద్య కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 3,008 మంది విద్యార్థులకు ఓవర్సీస్‌ పథకం కింద రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రూ.179.90 కోట్ల నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు. అయితే, ఇదే పథకంలో ఈడబ్ల్యూఎస్‌ పేద విద్యార్థులను విస్మరించడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో అగ్రవర్ణ పేద విద్యార్థుల భవిష్యత్తుకు అన్యాయం చేయవద్దని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.
​చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
సెప్టెంబరు 17ను తెలంగాణ విముక్తి దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పోలాడి రామారావు డిమాండ్‌ చేశారు. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో ఐదు వేల మందికి పైగా వీరులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాలకులు ఆ మహోన్నత చరిత్రను విస్మరించడం తగదన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ అధికారిక వేడుకలు జరపాలని, సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని స్పష్టం చేశారు.
​సమావేశంలో ఓసీ జేఏసీ నాయకులు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

వైభవంగా శ్రీకృష్ణుడి ‘ఊరు ఎరిగింపు’ (తుమ్మనపల్లిలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు) జ్ఞానదీప్తిగా కృష్ణుడి ‘ఎరిగింపు’ (ఆకర్షణీయమైన ఇతర ఆప్షన్లు: ఘనంగా కృష్ణ తత్త్వ ప్రబోధం / తుమ్మనపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జగద్గురు ఊరేగింపు).

దమ్ముంటే ‘దళితబంధు’ అమలు చేయండి: ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ – దళిత సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గాలికొదిలేసింది. – హుజూరాబాద్‌లో రెండో విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్‌..

దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దొరల ఇళ్ల ముందు చావుడప్పు కొడతాం బిడ్డ! 24 గంటల్లో తాతా మధు, కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: హుజురాబాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్ డిమాండ్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !