డబుల్ ఇళ్ల కేటాయింపులో న్యాయం చేయాలి.. లేకపోతే రాజీనామా చేస్తా! ప్రజావాణిలో 26వ వార్డు కౌన్సిలర్ లావణ్య విజ్ఞప్తి.

bahubalamtv Reporter
bahubalamtv.in

డబుల్ ఇళ్ల కేటాయింపులో న్యాయం చేయాలి.. లేకపోతే రాజీనామా చేస్తా! ప్రజావాణిలో 26వ వార్డు కౌన్సిలర్ లావణ్య విజ్ఞప్తి.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ : మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను తమ వార్డులోని నిరుపేదలకే కేటాయించాలని 26వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ప్రజాపాలన'లో వార్డు నుంచి 45 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 20 కుటుంబాలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల నాటి ఆస్తులను లబ్ధిదారుల ఖాతాలో చూపిస్తూ అర్హులను జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. అధికారులే స్వయంగా వార్డులో సభలు నిర్వహించి, దరఖాస్తుదారుల ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని కోరారు.
రికార్డుల ఆధారంగా విచారణ జరిపి నిజమైన పేదలకు ఇళ్లు కేటాయించకపోతే, లబ్ధిదారుల సమక్షంలోనే తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు, మున్సిపల్ ఛైర్మన్ సుమలతలకు కూడా వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ : మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను తమ వార్డులోని నిరుపేదలకే కేటాయించాలని 26వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన’లో వార్డు నుంచి 45 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 20 కుటుంబాలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల నాటి ఆస్తులను లబ్ధిదారుల ఖాతాలో చూపిస్తూ అర్హులను జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. అధికారులే స్వయంగా వార్డులో సభలు నిర్వహించి, దరఖాస్తుదారుల ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని కోరారు.
రికార్డుల ఆధారంగా విచారణ జరిపి నిజమైన పేదలకు ఇళ్లు కేటాయించకపోతే, లబ్ధిదారుల సమక్షంలోనే తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు, మున్సిపల్ ఛైర్మన్ సుమలతలకు కూడా వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !