ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకూ విదేశీ విద్యా నిధులు ఇవ్వాలి సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలి ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్

bahubalamtv Reporter
bahubalamtv.in

ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకూ విదేశీ విద్యా నిధులు ఇవ్వాలి సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలి ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్

బాహు బలంన్యూస్ హైదరాబాద్ , సెప్టెంబర్ 12:
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్న ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల (ఈడబ్ల్యూఎస్) పేద విద్యార్థులకూ తక్షణమే ఓవర్సీస్ స్కీం వర్తింపజేసి, నిధులు మంజూరు చేయాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. శనివారం నగరంలో ఐకాస నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 3,008 మంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం ఓవర్సీస్ పథకం కింద రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.179.90 కోట్ల నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇదే పథకంలో ఈడబ్ల్యూఎస్ పేద విద్యార్థులను పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓసీ పేదలకు అన్యాయం చేయవద్దని ఆయన కోరారు.
చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
సెప్టెంబరు 17ను హైదరాబాద్ సంస్థాన విముక్తి దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పోలాడి రామారావు కోరారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు జరిగిన సాయుధ పోరాటంలో ఐదు వేల మందికి పైగా అమరులయ్యారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసం గత, ప్రస్తుత ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను విస్మరించడం తగదన్నారు. విముక్తి లేదా విలీనం ఏదో ఒక పేరుతో సాయుధ పోరాటాన్ని గుర్తించి, సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించడంతో పాటు ఈ పోరాట చరిత్రను భావితరాలకు తెలిసేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఐకాస నాయకులు ల్యాగల వీరారెడ్డి, బోయినపల్లి శ్రీనివాసరావు, కొత్తకొండ రవీందర్‌రావు, అండెం రమణారెడ్డి, తీగల లక్ష్మణ్‌రావు, దడిగాల వెంకటేశ్వరరావులతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

వైభవంగా శ్రీకృష్ణుడి ‘ఊరు ఎరిగింపు’ (తుమ్మనపల్లిలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు) జ్ఞానదీప్తిగా కృష్ణుడి ‘ఎరిగింపు’ (ఆకర్షణీయమైన ఇతర ఆప్షన్లు: ఘనంగా కృష్ణ తత్త్వ ప్రబోధం / తుమ్మనపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జగద్గురు ఊరేగింపు).

దమ్ముంటే ‘దళితబంధు’ అమలు చేయండి: ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ – దళిత సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గాలికొదిలేసింది. – హుజూరాబాద్‌లో రెండో విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్‌..

దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దొరల ఇళ్ల ముందు చావుడప్పు కొడతాం బిడ్డ! 24 గంటల్లో తాతా మధు, కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: హుజురాబాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్ డిమాండ్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !