బాహు బలంన్యూస్,హుజురాబాద్, ఆగస్టు 03,:
సామాజిక మాధ్యమాల ద్వారా తన ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కోకపేట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన సబ్బని వెంకట్ ప్రస్తుతం కోకపేట్‌లోని ‘మై హోమ్ తార్క్ష్య’ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. ఆయన సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత ఉద్యోగం చేస్తూనే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గడిచిన రెండు నెలలుగా హుజురాబాద్ కు చెందిన అర్షద్, మేడుదుల అర్జున్, అమ్జద్ ఖాన్, మురళి కందగట్లలతో పాటు మరికొందరు ముఠాగా ఏర్పడి ఆయన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో అసభ్యకరమైన, నిందాపూరితమైన కామెంట్లు పెడుతున్నారనీ,.
మే 31న అర్ధరాత్రి వేళ వెంకట్ ఫోటోలతో అసభ్యకరమైన కంటెంట్‌ను, నిందలతో కూడిన వీడియోలను రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారనీ. అంతేకాకుండా, రాత్రి వేళల్లో వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ హుజూరాబాద్ వస్తే దాడి చేస్తామని కూడా బెదిరించినట్లు తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు బిఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు,ల తో పాటు ఐటీ యాక్ట్ కింద, కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ జి.రాజేష్ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.










