అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో ‘ఉచిత న్యూరో క్యాంప్’ …..ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహణ… ప్రముఖ న్యూరో సర్జన్ డా. అభిలాష్ గజ్జల వైద్య సేవలు

bahubalamtv Reporter
bahubalamtv.in

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో ‘ఉచిత న్యూరో క్యాంప్’ …..ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహణ… ప్రముఖ న్యూరో సర్జన్ డా. అభిలాష్ గజ్జల వైద్య సేవలు

బాహు బలంన్యూస్ వరంగల్ జూలై 25 : మెదడు, నరాలు మరియు వెన్నుపూస సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న రోగుల కోసం వరంగల్ కొత్తపేటలోని ‘అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్’ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ప్రత్యేక ఉచిత న్యూరో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ క్యాంప్ అందుబాటులో ఉంటుందని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.
నిపుణుల వైద్య సేవలు..
ప్రముఖ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ అభిలాష్ గజ్జల ఆధ్వర్యంలో ఈ శిబిరం సాగనుంది. బాధితులను స్వయంగా పరీక్షించి, వ్యాధి తీవ్రతను బట్టి తగిన చికిత్స సలహాలను ఉచితంగా అందించనున్నారు. దీర్ఘకాలిక తలనొప్పి, మెదడు సమస్యలు, పక్షవాతం, కాళ్లు–చేతుల తిమ్మిర్లు, మెడ, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలు మరియు నరాల బలహీనతతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు.
పరీక్షలు, శస్త్రచికిత్సలపై భారీ రాయితీలు..
క్యాంప్‌నకు వచ్చే రోగుల కోసం వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు ఆస్పత్రి ప్రతినిధులు తెలిపారు:
రక్త పరీక్షలు: న్యూరో ప్రొఫైల్ పరీక్షలు రూ. 1,000 కే అందుబాటులో ఉంటాయి.
స్కాన్‌లు & నిర్ధారణ: సీటీ స్కాన్ (CT Scan), ఎన్‌సీఎస్ (NCS), ఈఈజీ (EEG) వంటి అత్యవసర పరీక్షలను కూడా కేవలం రూ. 1,000లకే అందిస్తున్నారు.
శస్త్రచికిత్సలు: వెన్నుపూస (స్పైన్) శస్త్రచికిత్సలు అవసరమైన రోగులకు 20 శాతం వరకు ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
నరాల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే తీవ్ర అనారోగ్యాల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని వైద్యులు తెలిపారు.
సంప్రదించాల్సిన వివరాలు
ఆసక్తి కలిగిన బాధితులు ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.
వేదిక: అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, కొత్తపేట క్రాస్ రోడ్, అరేపల్లి, వరంగల్ – 506006.
అపాయింట్‌మెంట్ కోసం: 94598 75555 నంబరులో సంప్రదించవచ్చు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !