ప్రజాగుండెల్లో చెరగని ముద్ర… ‘దామన్న’ సేవలు చిరస్మరణీయం! ఘనంగా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి 70వ జయంతి వేడుకలు.. సదాశివపల్లి జంక్షన్ వద్ద విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన రైతు ప్రజా సంఘాల (జే ఎ సి) జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడుసీనియర్ నాయకులు పోలాడి రామారావు …పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ముద్దసాని అభిమానులు

బాహు బలంన్యూస్, కరీంనగర్ జూలై 20:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రగతికి, ప్రజల సంక్షేమానికి అప్పటి కమలాపూర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి కీ.శే. ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు తరతరాలకీ చిరస్మరణీయమని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు పోలాడి రామారావు కొనియాడారు. ముద్దసాని 70వ జయంతి సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని మానకొండూర్ మండల సరిహద్దు, సదాశివపల్లి కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా నాయకులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం స్థానికులు, అభిమానులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం పోలాడి రామారావు మాట్లాడుతూ.. కేవలం 29 ఏళ్ల పిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలిచి, 30 ఏళ్లకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుదైన ప్రజా నాయకుడు ముద్దసాని అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కరువు, భూగర్భ గనుల శాఖల మంత్రిగా.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో సాంకేతిక విద్య, రవాణా, ప్రభుత్వ సర్వీసుల శాఖల మంత్రిగా పనిచేసి జిల్లా రూపురేఖలు మార్చారని గుర్తుచేసుకున్నారు.
జిల్లా అభివృద్ధికి బాటలు.. చివరి రైతు వరకూ సాగునీరు
కమలాపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన దామోదర్ రెడ్డి.. పాత హుజూరాబాద్ తాలూకా పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) ఆయకట్టు చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా నిత్యం కాలువల వెంట పర్యవేక్షిస్తూ రైతు బాంధవుడిగా నిలిచారన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తూ చెరువులు, కుంటల పునరుద్ధరణకు, ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లెకూ బీటీ రోడ్లు, కాజ్‌వేల నిర్మాణంతో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మారుమూల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం, తాగునీటి వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉమ్మడి జిల్లాలో ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు కృషి చేసి వేలాదిమంది గ్రామీణ యువతకు ఉపాధి, సాంకేతిక విద్య అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు.
పేదల బాంధవుడు.. కార్యకర్తలకు నిత్య స్ఫూర్తిప్రదాత
అర్థరాత్రి దాటినా సరే పేదలు, బడుగు బలహీన వర్గాలు, రైతులు, యువతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో గ్రామీణ వైద్య రంగానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని స్పష్టం చేశారు.
‘కరీంనగర్ టైగర్’గా, డాషింగ్ అండ్ డైనమిక్ నాయకుడిగా ‘దామన్న’గా చెరగని ముద్ర వేసుకున్న ఆయన లాంటి ప్రజాదరణ పొందిన నాయకులు నేటి రాజకీయాల్లో అరుదని రామారావు వ్యాఖ్యానించారు. ఎంతోమంది సామాన్య కార్యకర్తలను నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దిన ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్, కార్పొరేటర్ అజయ్ గౌడ్, నాయకులు కొత్తూరు జగన్ గౌడ్, ముద్దసాని కృష్ణారెడ్డి, ఆడెపు కమలాకర్, సింగిరెడ్డి ఎల్లారెడ్డి, బండి నరేష్, కనకం కుమార్, తాళ్లపల్లి అంజయ్యలతో పాటు ముద్దసాని అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ప్రజాగుండెల్లో చెరగని ముద్ర… ‘దామన్న’ సేవలు చిరస్మరణీయం! ఘనంగా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి 70వ జయంతి వేడుకలు.. సదాశివపల్లి జంక్షన్ వద్ద విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన రైతు ప్రజా సంఘాల (జే ఎ సి) జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడుసీనియర్ నాయకులు పోలాడి రామారావు …పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ముద్దసాని అభిమానులు

ప్లంబింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…: హుజరాబాద్‌లో భారీ ర్యాలీ, తహసిల్దార్‌కు వినతి…. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్ల పెంపు.. ఇందిరమ్మ ఇళ్లు, సంఘ భవన స్థలం కేటాయించాలని జేఏసీ డిమాండ్…

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !