సైదాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు అండగా ‘జై భీమ్’ యూత్ లీడర్ గడ్డం విశాల్‌ * పాఠశాల సమస్యలపై తక్షణమే స్పందన.. పోలీసులకు ఫిర్యాదు * విద్యార్థినులకు ‘నేనున్నానంటూ’ కొండంత ధైర్యం!

bahubalamtv Reporter
bahubalamtv.in

సైదాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు అండగా ‘జై భీమ్’ యూత్ లీడర్ గడ్డం విశాల్‌ * పాఠశాల సమస్యలపై తక్షణమే స్పందన.. పోలీసులకు ఫిర్యాదు * విద్యార్థినులకు ‘నేనున్నానంటూ’ కొండంత ధైర్యం!

బాహు బలంన్యూస్ , సైదాపూర్, జూన్ 29:
మండల కేంద్రంలోని సోమవారం గ్రామంలో గల మోడల్ స్కూల్‌లో సరైన విద్యా వసతులు అందడం లేదని, అలాగే పాఠశాల పరిసరాల్లో ఆకతాయిల వేధింపులు ఎక్కువయ్యాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ పరిసరాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై సోమవారం నాడు 10వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 'జై భీమ్' యూత్ లీడర్, సామాజిక కార్యకర్త గడ్డం విశాల్‌ను కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. "అన్నయ్యా.. మాకు సరైన విద్య అందడం లేదు, బయట వ్యక్తుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం.. మా సమస్యలను కొంచెం పట్టించుకోండి" అని విద్యార్థులు ఆయనకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన జై భీమ్ లీడర్
విద్యార్థుల ఫిర్యాదుపై గడ్డం విశాల్ తక్షణమే స్పందించారు. వెంటనే మోడల్ స్కూల్‌కు చేరుకుని అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో కొందరు బయటి వ్యక్తులు, ఆకతాయిలు సిగరెట్లు, గుట్కాలు తాగుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ఆయన గమనించారు. అంతేకాకుండా, బయట తిరిగే యువకులు బైక్‌లపై స్కూల్ పరిసరాల్లోకి వస్తూ.. ఇక్కడి విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థినులకు కొండంత ధైర్యం..
ఈ సందర్భంగా గడ్డం విశాల్ విద్యార్థులతో, ముఖ్యంగా విద్యార్థినులతో మాట్లాడి వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. "మీకు ఎటువంటి సహాయం కావాలన్నా, ఏ కష్టం వచ్చినా నేనున్నానని హామీ ఇస్తున్నాను. ఎవరూ, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. చదువుపై మాత్రమే దృష్టి పెట్టండి" అని వారికి భరోసా కల్పించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్‌తో సమావేశమై, స్కూల్ భద్రత, విద్యార్థుల భద్రత, పై విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. పాఠశాల పరిసరాల్లో క్రమశిక్షణ, భద్రత కరువవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. 24 గంటల్లో రక్షణ చర్యలు!
పాఠశాలలో నెలకొన్న ఈ తీవ్రమైన పరిస్థితిపై ప్రిన్సిపాల్ నుంచి రాతపూర్వక పిటిషన్ తీసుకున్న గడ్డం విశాల్, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు. విద్యార్థినుల రక్షణ, స్కూల్ పరిసరాల్లో ఆకతాయిల అగడాలపై పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. రాబోయే 24 గంటల్లో పాఠశాల వద్ద సరైన భద్రత, విద్యార్థుల భద్రతపై పోలీస్ నిఘా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల దారిలో నడుస్తూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే స్పందించి అండగా నిలిచిన గడ్డం విశాల్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ , సైదాపూర్, జూన్ 29:
మండల కేంద్రంలోని సోమవారం గ్రామంలో గల మోడల్ స్కూల్‌లో సరైన విద్యా వసతులు అందడం లేదని, అలాగే పాఠశాల పరిసరాల్లో ఆకతాయిల వేధింపులు ఎక్కువయ్యాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ పరిసరాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై సోమవారం నాడు 10వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు ‘జై భీమ్’ యూత్ లీడర్, సామాజిక కార్యకర్త గడ్డం విశాల్‌ను కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. “అన్నయ్యా.. మాకు సరైన విద్య అందడం లేదు, బయట వ్యక్తుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం.. మా సమస్యలను కొంచెం పట్టించుకోండి” అని విద్యార్థులు ఆయనకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన జై భీమ్ లీడర్
విద్యార్థుల ఫిర్యాదుపై గడ్డం విశాల్ తక్షణమే స్పందించారు. వెంటనే మోడల్ స్కూల్‌కు చేరుకుని అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో కొందరు బయటి వ్యక్తులు, ఆకతాయిలు సిగరెట్లు, గుట్కాలు తాగుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ఆయన గమనించారు. అంతేకాకుండా, బయట తిరిగే యువకులు బైక్‌లపై స్కూల్ పరిసరాల్లోకి వస్తూ.. ఇక్కడి విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థినులకు కొండంత ధైర్యం..
ఈ సందర్భంగా గడ్డం విశాల్ విద్యార్థులతో, ముఖ్యంగా విద్యార్థినులతో మాట్లాడి వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. “మీకు ఎటువంటి సహాయం కావాలన్నా, ఏ కష్టం వచ్చినా నేనున్నానని హామీ ఇస్తున్నాను. ఎవరూ, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. చదువుపై మాత్రమే దృష్టి పెట్టండి” అని వారికి భరోసా కల్పించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్‌తో సమావేశమై, స్కూల్ భద్రత, విద్యార్థుల భద్రత, పై విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. పాఠశాల పరిసరాల్లో క్రమశిక్షణ, భద్రత కరువవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. 24 గంటల్లో రక్షణ చర్యలు!
పాఠశాలలో నెలకొన్న ఈ తీవ్రమైన పరిస్థితిపై ప్రిన్సిపాల్ నుంచి రాతపూర్వక పిటిషన్ తీసుకున్న గడ్డం విశాల్, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు. విద్యార్థినుల రక్షణ, స్కూల్ పరిసరాల్లో ఆకతాయిల అగడాలపై పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. రాబోయే 24 గంటల్లో పాఠశాల వద్ద సరైన భద్రత, విద్యార్థుల భద్రతపై పోలీస్ నిఘా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల దారిలో నడుస్తూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే స్పందించి అండగా నిలిచిన గడ్డం విశాల్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !