కాట్రపల్లిలో ముగిసిన దశాబ్దాల రోడ్డు కష్టాలు ఏకగ్రీవ తీర్మానంతో 40 అడుగులుగా రహదారి విస్తరణ గ్రామ ఈ కోన నుంచి ఆ కోన వరకు పనుల పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.

bahubalamtv Reporter
bahubalamtv.in

కాట్రపల్లిలో ముగిసిన దశాబ్దాల రోడ్డు కష్టాలు ఏకగ్రీవ తీర్మానంతో 40 అడుగులుగా రహదారి విస్తరణ గ్రామ ఈ కోన నుంచి ఆ కోన వరకు పనుల పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్‌ జూన్ 25 : మండలం పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రధాన రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇరుకైన రోడ్డు కారణంగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు, గ్రామస్థుల కష్టాలను తీరుస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఎదురెదురుగా రాలేని స్థితి నుంచి..
గతంలో కాట్రపల్లి ప్రధాన రహదారి అత్యంత ఇరుకుగా ఉండేది. కనీసం రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఒకదానికొకటి దాటి వెళ్లడానికి వీల్లేని పరిస్థితి నెలకొనేది. దీంతో ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం, వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడటం నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్యపై స్పందించిన స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై, రోడ్డు విస్తరణ చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
ఊరంతా 40 అడుగుల సువిశాల రహదారి..
పాలకవర్గం తీర్మానం మేరకు గ్రామంలో అత్యంత పకడ్బందీగా రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. గ్రామం ఈ కోన నుండి ఆ కోన వరకు.. అంటే ఊరు ఎంత పొడవు ఉందో అంత పొడవునా ఆక్రమణలను తొలగిస్తూ ఏకంగా 40 అడుగుల (40 ఫీట్ల) వెడల్పుతో సువిశాలమైన రహదారిని సిద్ధం చేశారు.
పాలకవర్గానికి గ్రామస్థుల కృతజ్ఞతలు..
దశాబ్దాల నాటి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, గ్రామానికి కొత్త రూపునిచ్చినందుకు గానూ స్థానిక సర్పంచ్ పెరుమాండ్ల హైమా, బిక్షపతి, ఉపసర్పంచ్ గంగదారి బిక్షపతిలతో పాటు ఈ అభివృద్ధి నిర్ణయంలో కీలక పాత్ర పోషించిన వార్డు సభ్యులు కోమటి శ్రీనివాస్, బాలగోని అరుంధతి కృష్ణంరాజు, తాళ్లపెళ్లి అనూష అనిల్, తాడూరి ప్రమోద్ గౌడ్, మిడివెల్లి నాగరాజు, నిమ్మల నరేష్, ముప్పు లావణ్య సహదేవ్, మాడుగుల విజయలక్ష్మి వెంకటస్వామి, మైసా అర్జున్ అందరికీ గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పాలకవర్గం మొత్తం ఏకతాటిపై నిలిచి రోడ్డు విస్తరణను విజయవంతం చేయడంతో ప్రయాణాలు సుగమమయ్యాయని ఊరి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !