రైతు రక్షణలో ప్రభుత్వం విఫలం.. పోలాడి రామారావు ……వాయిదా పడ్డ ‘మహాగర్జన’.. మే 30న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఏప్రిల్ 26: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ, ధాన్యం కొనుగోళ్లలో సహాయ సహకారాలు అందించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు విమర్శించారు. ఆదివారం హుజూరాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి, చెల్పూర్, శాలపల్లి, రాంపూర్, జూపాక, కందుగుల, బోర్నపల్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి, ధాన్యం విక్రయాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
మే 30కి ‘మహాగర్జన’ వాయిదా
ఈ నెల 28న కరీంనగర్‌లో నిర్వహించాల్సిన ‘రైతుల మహాగర్జన సమరభేరి’ సభను మే 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రామారావు ప్రకటించారు. ప్రస్తుతం వరి కోతలు పూర్తికాకపోవడం, రైతులు బిజీగా ఉండటంతో వివిధ సామాజిక వర్గాలు, విద్యార్థి సంఘాల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మే 30న సుమారు రెండు లక్షల మందితో భారీ ఎత్తున ఈ సభను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తం
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించిందే తప్ప, వాస్తవానికి కొనుగోళ్లు జరపడం లేదని రామారావు ఆరోపించారు. “అకాల వర్షాలతో రైతులు వణికిపోతుంటే, కనీసం టార్పాలిన్ షీట్లు, గన్నీ బ్యాగులు కూడా సరఫరా చేయడం లేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు తమ పంటను తక్కువ ధరకే ప్రైవేటు దళారులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలకు, ప్రైవేటు వ్యక్తులకు మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాల వల్లే రైతులకు ఈ దుస్థితి దాపురించింది” అని ఆయన మండిపడ్డారు.
నిలువు దోపిడీ.. బోనస్‌కు ఎసరు!
క్వింటాల్‌కు తాలు, మట్టి లేని ఎండు ధాన్యానికి కూడా అదనంగా ఆరు కిలోల చొప్పున కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ ఇవ్వకుండా తప్పించుకోవడానికే, కావాలనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. అప్పటికే 60 శాతం ధాన్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని గుర్తు చేశారు.
రైతు భరోసాపై నిర్లక్ష్యం
సాగు సమయంలో ఇవ్వాల్సిన ‘రైతు భరోసా’ నిధులను ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు ఎగ్గొట్టిందని, ఇప్పుడు పంట కోత దశలో అరకొరగా, విడతల వారీగా ఇవ్వడం దారుణమని రామారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కొండాల్ రెడ్డి, మూగల శ్రీధర్ రెడ్డి, శ్రావణ్, సమ్మీరెడ్డి, సుధాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నీట్ ‘లీకేజీ’పై విద్యార్థి లోకం సమరభేరి! విద్యార్థుల అలుపెరుగని ఆందోళనకు లొంగిన ఢిల్లీ పీఠం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా శుభసూచకం:….. ప్రజా సంఘాల జేఏసీ నేత పోలాడి రామారావు..

నీట్ అక్రమాలపై గళమెత్తిన విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి …. నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేరు….. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడద్దు:….. ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ..

ప్రజాగుండెల్లో చెరగని ముద్ర… ‘దామన్న’ సేవలు చిరస్మరణీయం! ఘనంగా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి 70వ జయంతి వేడుకలు.. సదాశివపల్లి జంక్షన్ వద్ద విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన రైతు ప్రజా సంఘాల (జే ఎ సి) జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడుసీనియర్ నాయకులు పోలాడి రామారావు …పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ముద్దసాని అభిమానులు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !