బి.సి. సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కందికొండ మొగిలి నియామకం.

bahubalamtv Reporter
bahubalamtv.in

బి.సి. సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కందికొండ మొగిలి నియామకం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూలై 18:
జాతీయ బి.సి. సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన కందికొండ మొగిలి నియమితులయ్యారు. జిల్లా స్థాయిలో వెనుకబడిన తరగతుల (బి.సి.) సామాజిక, రాజకీయ చైతన్యం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించారు. బి.సి. సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయనకు నియామకపు ఉత్తర్వులను జారీ చేశారు.
హర్షం వ్యక్తం చేసిన మొగిలి
తన నియామకంపై కందికొండ మొగిలి హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకముంచి ఈ కీలక బాధ్యతలను అప్పగించినందుకు జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ నియామకానికి సహకరించిన సంఘం నాయకులు పొలవేని పోచమల్లు యాదవ్, సందెల వెంకన్న, పీరెల్ల సాగయ్య, భీమ సాయిలు యాదవ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
బి.సి.ల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తాం
ఈ సందర్భంగా మొగిలి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో బి.సి.ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. బి.సి.లందరినీ సంఘటిత పరిచి, చట్టసభల్లో బి.సి.లకు రిజర్వేషన్ల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !