వరంగల్‌ అపోలో రీచ్‌ హాస్పిటల్‌లో 21 నుంచి ‘ఉచిత మెగా వైద్య శిబిరం’ మూడు రోజుల పాటు సేవలు.. ఉచితంగా కీలక పరీక్షలు.. ల్యాబ్‌ టెస్టులపై 50% రాయితీ….

బాహు బలంన్యూస్ వరంగల్‌, జూలై 18 :
ప్రజలకు అత్యాధునిక కార్పొరేట్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వరంగల్‌లోని అపోలో రీచ్‌ ఎన్‌ఎస్‌ఆర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత జనరల్ మెడిసిన్ మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. హనుమకొండ-వరంగల్‌ ప్రధాన రహదారి ఆరెపల్లి (కొత్తపేట క్రాస్‌ రోడ్స్‌) సమీపంలోని ఆసుపత్రి ప్రాంగణంలో ఈ నెల జూలై 21, 22, 23 తేదీలలో ఈ శిబిరం జరగనుంది. ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌, డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ ఎన్‌. రాజి రెడ్డి (MBBS, DNB) ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు రోగులను పరీక్షించనున్నారు.
ఉచిత పరీక్షల వివరాలు..
మారుతున్న జీవనశైలి కారణంగా తలెత్తుతున్న మధుమేహం (డయాబెటిస్‌), అధిక రక్తపోటు (బీపీ), థైరాయిడ్‌ లోపాలు, సీజనల్‌ వ్యాధులు మరియు వైరల్ జ్వరాలతో బాధపడే వారికి ఈ శిబిరంలో ఉచితంగా శారీరక పరీక్షలు నిర్వహించి, వైద్య సలహాలు, అవసరమైన చికిత్స అందిస్తారు. ఇందులో భాగంగా రోగులకు అత్యంత కీలకమైన సీబీపీ (CBP), రక్తంలో చక్కెర పరీక్షలు (RBS / FBS), కిడ్నీ పనితీరును పరీక్షించే సీరమ్‌ క్రియాటినిన్‌ పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేయనున్నారు.
రక్త పరీక్షలపై 50 శాతం రాయితీ..
గుండె ఆరోగ్యానికి సంబంధించిన లిపిడ్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌ ప్రొఫైల్‌, మరియు మూడు నెలల సగటు చక్కెర శాతాన్ని నిర్ధారించే హెచ్‌బీఏ1సీ (HbA1c) వంటి ఖరీదైన రక్త పరీక్షలపై 50 శాతం ప్రత్యేక రాయితీ (సగం ధరకే) కల్పిస్తున్నట్లు మేనేజ్‌మెంట్‌ పేర్కొంది.
నిర్లక్ష్యం వద్దు: డాక్టర్‌ రాజి రెడ్డి
మధుమేహం, బీపీ, థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలను చూపించవని, వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండె, మూత్రపిండాలు, కంటి చూపు వంటి కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్‌ ఎన్‌. రాజి రెడ్డి హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని ఉపయోగించుకుని ముందస్తు ఆరోగ్య పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించి సమయానికి చికిత్స పొందాలన్నారు. వరంగల్‌ నగర మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముందస్తు అపాయింట్‌మెంట్ల కొరకు 📞 94598 75555 నంబరులో సంప్రదించవచ్చు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ప్లంబింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…: హుజరాబాద్‌లో భారీ ర్యాలీ, తహసిల్దార్‌కు వినతి…. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్ల పెంపు.. ఇందిరమ్మ ఇళ్లు, సంఘ భవన స్థలం కేటాయించాలని జేఏసీ డిమాండ్…

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ప్లంబింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…: హుజరాబాద్‌లో భారీ ర్యాలీ, తహసిల్దార్‌కు వినతి…. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్ల పెంపు.. ఇందిరమ్మ ఇళ్లు, సంఘ భవన స్థలం కేటాయించాలని జేఏసీ డిమాండ్…