హామీల అమలులో ప్రభుత్వం విఫలం.. ఓసీల సంక్షేమాన్ని విస్మరిస్తే సహించం! సిద్ధిపేట కలెక్టరేట్‌ ఎదుట రెడ్డి, ఓసీ జేఏసీల భారీ ధర్నా.. పోలాడి రామారావు హెచ్చరిక..

బాహు బలంన్యూస్ సిద్ధిపేట, ఏప్రిల్ 21 :
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ఓసీ సామాజిక వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు అయిలినేని మల్లిఖార్జున రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన భారీ నిరసన దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడి హోదాలో పేద రెడ్ల కోసం ‘రెడ్డి కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తకపోవడంపై మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాలయాపన చేస్తూ ఓసీలను విస్మరిస్తున్నారని, తక్షణమే చట్టబద్ధత గల రెడ్డి, ఓసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా, రుణమాఫీపై పోరాటం తప్పదు
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే పాలకులు అన్నదాతలను నిలువునా ముంచుతున్నారని రామారావు ఆరోపించారు. రైతు భరోసా నిధులను విడతల వారీగా కాకుండా, సాగు సమయంలోనే ఒకేసారి విడుదల చేయాలని ఆయన పట్టుబట్టారు. రూ. 2 లక్షల రుణమాఫీలో ఇంకా 70 శాతం మందికి లబ్ధి చేకూరలేదని, ఆ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిలదీశారు. అలాగే, 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ. 6,000 పెన్షన్, రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచడం వంటి కీలక డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల నిలిపివేత, జాబ్ క్యాలెండర్ అమలులో నిర్లక్ష్యాన్ని వీడాలని, ఆర్థికంగా వెనుకబడిన ఓసీల కోసం తక్షణమే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కరీంనగర్ ‘మహాగర్జన’కు సమరభేరి
ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టేందుకు ఏప్రిల్ 28న కరీంనగర్‌లో లక్షలాది మందితో ‘రాష్ట్ర వ్యాప్త రైతు మహాగర్జన – సమరభేరి’ సభను నిర్వహించనున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా సాగే ఈ చారిత్రాత్మక సభకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వివిధ వర్గాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పామ్మ గారి రాంరెడ్డి, రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు బుట్టం గారి మాధవ రెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు పెండ్యాల రాం రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు గర్జనతో సర్కారును గద్దిస్తాం: పోలాడి రామారావు… ఈనెల 28న కరీంనగర్‌లో 2 లక్షల మందితో ‘సమరభేరి’ …అరకొర రుణమాఫీ, రైతు భరోసా ఎగవేతపై ధ్వజం ..హుజూరాబాద్‌లో సన్నాహక సమావేశం.. గోడప్రతుల ఆవిష్కరణ…

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రైతు గర్జనతో సర్కారును గద్దిస్తాం: పోలాడి రామారావు… ఈనెల 28న కరీంనగర్‌లో 2 లక్షల మందితో ‘సమరభేరి’ …అరకొర రుణమాఫీ, రైతు భరోసా ఎగవేతపై ధ్వజం ..హుజూరాబాద్‌లో సన్నాహక సమావేశం.. గోడప్రతుల ఆవిష్కరణ…