చంద్రబాబు విజన్ తెలుగు జాతికి గర్వకారణం. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

bahubalamtv Reporter
bahubalamtv.in

చంద్రబాబు విజన్ తెలుగు జాతికి గర్వకారణం. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

బాహు బలంన్యూస్ కరీంనగర్ స్వేచ్ఛ : తెలుగుదేశం పార్టీ అధినేత, నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మిన్నంటాయి. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సారథ్యంలో హోటల్ శ్రీనివాస్ ఆవరణలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఓసి ఐకాస, వివిధ ప్రజా సంఘాలు మరియు టీడీపీ అభిమానుల సమక్షంలో పోలాడి రామారావు కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వయంగా స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి పండుగ వాతావరణాన్ని నింపారు.
అపర చాణక్యుడు.. నిత్య శ్రామికుడు..
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ చాతుర్యాన్ని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆత్మ వికాసానికి చంద్రబాబు ఒక ప్రతీక అని, ఆయన నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే నిత్య శ్రామికుడని అభివర్ణించారు. "ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడు ఆయన. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని అద్భుతాలు సృష్టించిన అపర చాణక్యుడు చంద్రబాబు" అని రామారావు పేర్కొన్నారు. యువతరానికి ఒక ల్యాండ్ మార్క్ లా నిలిచే మార్గదర్శి మన నాయకుడు కావడం గర్వకారణమని ఆయన ఆకాంక్షించారు.
మహిళల పాలిట 'దేవుడు ఇచ్చిన అన్న'
పాలనలో చంద్రబాబు అనుసరించిన వినూత్న పోకడలను రామారావు వివరిస్తూ.. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ఆయన ముందుకు సాగారన్నారు. మహిళలకు రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి రీత్యా పెద్దపీట వేసి, వారిని ఆర్థికంగా స్వయం సమృద్ధి దిశగా నడిపించిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. అందుకే మహిళలందరూ ఆయనను 'దేవుడు ఇచ్చిన అన్న'గా గుండెల్లో పెట్టుకున్నారని రామారావు గుర్తు చేశారు.
సీనియర్లకు సన్మానం - నేతల సందడి..
పార్టీ ఆవిర్భావం నుండి క్రమశిక్షణతో సేవలందిస్తున్న జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులను ఈ సందర్భంగా పోలాడి రామారావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి రవీందర్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పీవీ రాజ్ కుమార్, రెడ్డి సంఘాల కన్వీనర్ బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఓసి జేఏసీ నేత చింతిరెడ్డి రమణా రెడ్డి పాల్గొన్నారు.
వీరితో పాటు టీడీపీ రాష్ట్ర వాణిజ్య సెల్ కార్యదర్శి ఎలిమిల్లి కిషన్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి వినీత్, నాయకులు ఇట్ట మల్లేశం, గోపు గోపాల్ రెడ్డి, బంజేరు పల్లి సర్పంచ్ తోట శ్రీనివాస్, కళ్యాడపు నరేష్, కొరిమి వేణు మాధవ్, కలకుంట్ల సత్యనారాయణ రావు మరియు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ కార్యదర్శి దడిగల వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ కరీంనగర్ స్వేచ్ఛ : తెలుగుదేశం పార్టీ అధినేత, నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మిన్నంటాయి. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సారథ్యంలో హోటల్ శ్రీనివాస్ ఆవరణలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఓసి ఐకాస, వివిధ ప్రజా సంఘాలు మరియు టీడీపీ అభిమానుల సమక్షంలో పోలాడి రామారావు కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వయంగా స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి పండుగ వాతావరణాన్ని నింపారు.
అపర చాణక్యుడు.. నిత్య శ్రామికుడు..
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ చాతుర్యాన్ని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆత్మ వికాసానికి చంద్రబాబు ఒక ప్రతీక అని, ఆయన నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే నిత్య శ్రామికుడని అభివర్ణించారు. “ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడు ఆయన. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని అద్భుతాలు సృష్టించిన అపర చాణక్యుడు చంద్రబాబు” అని రామారావు పేర్కొన్నారు. యువతరానికి ఒక ల్యాండ్ మార్క్ లా నిలిచే మార్గదర్శి మన నాయకుడు కావడం గర్వకారణమని ఆయన ఆకాంక్షించారు.
మహిళల పాలిట ‘దేవుడు ఇచ్చిన అన్న’
పాలనలో చంద్రబాబు అనుసరించిన వినూత్న పోకడలను రామారావు వివరిస్తూ.. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ఆయన ముందుకు సాగారన్నారు. మహిళలకు రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి రీత్యా పెద్దపీట వేసి, వారిని ఆర్థికంగా స్వయం సమృద్ధి దిశగా నడిపించిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. అందుకే మహిళలందరూ ఆయనను ‘దేవుడు ఇచ్చిన అన్న’గా గుండెల్లో పెట్టుకున్నారని రామారావు గుర్తు చేశారు.
సీనియర్లకు సన్మానం – నేతల సందడి..
పార్టీ ఆవిర్భావం నుండి క్రమశిక్షణతో సేవలందిస్తున్న జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులను ఈ సందర్భంగా పోలాడి రామారావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి రవీందర్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పీవీ రాజ్ కుమార్, రెడ్డి సంఘాల కన్వీనర్ బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఓసి జేఏసీ నేత చింతిరెడ్డి రమణా రెడ్డి పాల్గొన్నారు.
వీరితో పాటు టీడీపీ రాష్ట్ర వాణిజ్య సెల్ కార్యదర్శి ఎలిమిల్లి కిషన్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి వినీత్, నాయకులు ఇట్ట మల్లేశం, గోపు గోపాల్ రెడ్డి, బంజేరు పల్లి సర్పంచ్ తోట శ్రీనివాస్, కళ్యాడపు నరేష్, కొరిమి వేణు మాధవ్, కలకుంట్ల సత్యనారాయణ రావు మరియు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ కార్యదర్శి దడిగల వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !