రైతు గర్జనతో సర్కారును గద్దిస్తాం: పోలాడి రామారావు… ఈనెల 28న కరీంనగర్‌లో 2 లక్షల మందితో ‘సమరభేరి’ …అరకొర రుణమాఫీ, రైతు భరోసా ఎగవేతపై ధ్వజం ..హుజూరాబాద్‌లో సన్నాహక సమావేశం.. గోడప్రతుల ఆవిష్కరణ…

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఎన్నికల వేళ అన్నదాతలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న కరీంనగర్ వేదికగా ‘రైతు మహా గర్జన – సమరభేరి’ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. పార్టీలాతీతంగా నిర్వహించే ఈ మహాసభకు సుమారు రెండు లక్షల మంది రైతులు తరలిరానున్నట్లు ఆయన వెల్లడించారు.

శుక్రవారం.హుజూరాబాద్‌లో..
హుజూరాబాద్-హుస్నాబాద్ డివిజన్ల రైస్ మిల్లర్లు, సీడ్ కంపెనీల అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్య వైశ్య సంఘాల నాయకులతో కలిసి ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సభకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇచ్చిన హామీలు ఏమాయ్యాయి?
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని రామారావు విమర్శించారు.
రుణమాఫీలో అన్యాయం: రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, కేవలం 30 శాతం మందికే వర్తింపజేయడం దారుణమన్నారు. మిగిలిన 70 శాతం అర్హులైన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
రైతు భరోసా ఎగవేత: ఇప్పటికే రెండు విడతల రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని, సాగు పెట్టుబడి కోసం రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
బోనస్ వంచన: అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్న రకాలకే పరిమితం చేయడం రైతుల్ని వంచించడమేనని ధ్వజమెత్తారు.
పాలనా వైఫల్యాలపై నిలదీత.
రైతులతో పాటు విద్యార్థులు, యువతను కూడా ప్రభుత్వం మోసం చేసిందని రామారావు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నిలిచిపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ‘జాబ్ క్యాలెండర్’ అడ్రస్ లేదని విమర్శించారు. ఓసీ కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా, నిధులు కేటాయించకుండా నామమాత్రంగా ఉంచారని ఆక్షేపించారు. పాల ఉత్పత్తిదారులకు గతంలో ఉన్న రూ. 4 రాయితీని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.
ప్రధాన డిమాండ్లు.
50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ. 6,000 పింఛన్ అందించాలి.
రైతు బీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలి.
ప్రైవేట్ సీడ్ కంపెనీల దోపిడీని అరికట్టి, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలి.
పంట సాగు సమయంలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలి.
ఈ నెల 28న కరీంనగర్‌లో జరిగే ఈ మహా గర్జన సభ చారిత్రాత్మకం కాబోతుందని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కొండాల్ రెడ్డి, ఆర్య వైశ్య సంఘం నాయకుడు తాటిపల్లి రాజన్న, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కల్లెపు మోహన్ రావు, సీడ్ కంపెనీల అధ్యక్షుడు ఐరేని భాస్కర్ రెడ్డి, నాయకులు పుల్లూరి ప్రభాకర్ రావు, పలకల ఈశ్వర్ రెడ్డి, గర్రెపల్లి రాజమొగిలి, హరి శంకర్, జైపాల్ రెడ్డి, వేల్పుల రత్నం, రాజేశ్వర్ రావు, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు గర్జనతో సర్కారును గద్దిస్తాం: పోలాడి రామారావు… ఈనెల 28న కరీంనగర్‌లో 2 లక్షల మందితో ‘సమరభేరి’ …అరకొర రుణమాఫీ, రైతు భరోసా ఎగవేతపై ధ్వజం ..హుజూరాబాద్‌లో సన్నాహక సమావేశం.. గోడప్రతుల ఆవిష్కరణ…

రైతు గమ్యం.. కరీంనగర్ వైపు సమర గర్జన! 28న 2 లక్షల మందితో జలపాతంలా తరలిరావాలి: పోలాడి రామారావు పిలుపు – అన్నదాతల హక్కుల కోసం రాజీలేని పోరాటం – పార్టీలకతీతంగా ఏకమవుతున్న కర్షక లోకం – అఖిలపక్ష నేతలతో కలిసి వాల్ పోస్టర్ల ఆవిష్కరణ..

జననీరాజనం.. దామోదర్ రెడ్డి అజరామరం! కరీంనగర్‌లో మాజీ మంత్రి ముద్దసాని కాంస్య విగ్రహావిష్కరణ తరలివచ్చిన వేలాది మంది అభిమానులు, రాజకీయ ప్రముఖులు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమోఘం: పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రైతు గర్జనతో సర్కారును గద్దిస్తాం: పోలాడి రామారావు… ఈనెల 28న కరీంనగర్‌లో 2 లక్షల మందితో ‘సమరభేరి’ …అరకొర రుణమాఫీ, రైతు భరోసా ఎగవేతపై ధ్వజం ..హుజూరాబాద్‌లో సన్నాహక సమావేశం.. గోడప్రతుల ఆవిష్కరణ…