సేవా పథంలో యువత ముందుండాలి..మంద రాజ్.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఏప్రిల్ 14: ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయడం కంటే గొప్ప కార్యం మరొకటి లేదని అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు మంద రాజ్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గ విద్యుత్ శాఖ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంద రాజ్ మాట్లాడుతూ.. సమాజంలో రక్త నిల్వల కొరతను తీర్చడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. రక్తదానం వల్ల ప్రాణాలు కాపాడవచ్చని, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు మరియు పలువురు యువజన సంఘాల నాయకులు పాల్గొని రక్తదాతలను అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నీట్ ‘లీకేజీ’పై విద్యార్థి లోకం సమరభేరి! విద్యార్థుల అలుపెరుగని ఆందోళనకు లొంగిన ఢిల్లీ పీఠం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా శుభసూచకం:….. ప్రజా సంఘాల జేఏసీ నేత పోలాడి రామారావు..

నీట్ అక్రమాలపై గళమెత్తిన విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి …. నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేరు….. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడద్దు:….. ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ..

ప్రజాగుండెల్లో చెరగని ముద్ర… ‘దామన్న’ సేవలు చిరస్మరణీయం! ఘనంగా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి 70వ జయంతి వేడుకలు.. సదాశివపల్లి జంక్షన్ వద్ద విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన రైతు ప్రజా సంఘాల (జే ఎ సి) జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడుసీనియర్ నాయకులు పోలాడి రామారావు …పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ముద్దసాని అభిమానులు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !