డంపింగ్ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలి.. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

డంపింగ్ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలి.. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఏప్రిల్ 14,
ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ నివాస ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో గత 20 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.
23రోజులుగా కొనసాగుతున్న పోరు..
ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి, పర్యావరణానికి ముప్పు కలిగించే డంపింగ్ యార్డ్‌ను ఇక్కడ నిర్మించడం సరికాదని రామారావు పేర్కొన్నారు. గత 23 రోజులుగా మహిళలు, వృద్ధులు, యువత రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పాలకులు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, ఇక్కడి సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ప్రాజెక్టును నిలిపివేయాలని ఆయన కోరారు.
ప్రభుత్వానికి వారం రోజుల గడువు.
ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడాలని, వారం రోజుల్లోగా డంపింగ్ యార్డ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేయాలని రామారావు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలో తలపెట్టిన ఈ పోరాటాన్ని ప్రభుత్వం విస్మరిస్తే.. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ముట్టడికి సిద్ధం కావాలి.
వచ్చే వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో, జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు, ప్రజా సంఘాలను ఏకం చేసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటామని, బాధితులకు అండగా నిలబడతామని పోలాడి రామారావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు, బాధితులు మరియు అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !