రాజ్యాంగమే దేశానికి దిక్సూచి.. పోలాడి రామారావు ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.. ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహా గర్జన’కు తరలిరావాలని పిలుపు..

bahubalamtv Reporter
bahubalamtv.in

రాజ్యాంగమే దేశానికి దిక్సూచి.. పోలాడి రామారావు ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.. ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహా గర్జన’కు తరలిరావాలని పిలుపు..

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఏప్రిల్ 14:
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ దేశానికి అసలైన దిక్సూచి అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని హుజురాబాద్ పట్టణంలోని ప్రధాన కూడలి
అంబేద్కర్ చౌరస్తా (బస్టాండ్ సెంటర్) వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అంబేద్కర్ జయంతి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో రామారావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
నవ సమాజ నిర్మాణమే అంబేద్కర్ లక్ష్యం.
సమాజంలో విభిన్న వర్గాల మధ్య అంతరాలు తొలగాలని, సమానత్వం, స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణతో కూడిన నవ సమాజం నిర్మితం కావాలని అంబేద్కర్ ఆకాంక్షించారని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి, దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన దార్శనికత వల్లే రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు.
సమన్యాయమే ధ్యేయం..రిజర్వేషన్లపై స్పష్టత.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల (EWS) కోసం కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు అంబేద్కర్ ఆశించిన సమన్యాయం ప్రాతిపదికనే సాధ్యమయ్యాయని రామారావు తెలిపారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల ఫలాలు నిజమైన పేదలకు అందాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో 'క్రిమీలేయర్' పద్ధతిని అమలు చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 28న 'రైతు మహా గర్జన'
అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు ఇచ్చిన హామీలను విస్మరిస్తే గట్టిగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. అన్నదాతల న్యాయమైన డిమాండ్ల సాధనకై, ఓసి ఐకాస మరియు రైతు ప్రజాసంఘాల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ (మంగళవారం) సాయంత్రం 3 గంటలకు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ (SRR) డిగ్రీ కళాశాల మైదానంలో చారిత్రాత్మక 'రాష్ట్ర వ్యాప్త రైతు మహా గర్జన' నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమర భేరి సభకు పార్టీలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు మరియు అంబేద్కర్ జయంతి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఏప్రిల్ 14:
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ దేశానికి అసలైన దిక్సూచి అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని హుజురాబాద్ పట్టణంలోని ప్రధాన కూడలి
అంబేద్కర్ చౌరస్తా (బస్టాండ్ సెంటర్) వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అంబేద్కర్ జయంతి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో రామారావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
నవ సమాజ నిర్మాణమే అంబేద్కర్ లక్ష్యం.
సమాజంలో విభిన్న వర్గాల మధ్య అంతరాలు తొలగాలని, సమానత్వం, స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణతో కూడిన నవ సమాజం నిర్మితం కావాలని అంబేద్కర్ ఆకాంక్షించారని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి, దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన దార్శనికత వల్లే రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు.
సమన్యాయమే ధ్యేయం..రిజర్వేషన్లపై స్పష్టత.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల (EWS) కోసం కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు అంబేద్కర్ ఆశించిన సమన్యాయం ప్రాతిపదికనే సాధ్యమయ్యాయని రామారావు తెలిపారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల ఫలాలు నిజమైన పేదలకు అందాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో ‘క్రిమీలేయర్’ పద్ధతిని అమలు చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 28న ‘రైతు మహా గర్జన’
అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు ఇచ్చిన హామీలను విస్మరిస్తే గట్టిగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. అన్నదాతల న్యాయమైన డిమాండ్ల సాధనకై, ఓసి ఐకాస మరియు రైతు ప్రజాసంఘాల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ (మంగళవారం) సాయంత్రం 3 గంటలకు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ (SRR) డిగ్రీ కళాశాల మైదానంలో చారిత్రాత్మక ‘రాష్ట్ర వ్యాప్త రైతు మహా గర్జన’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమర భేరి సభకు పార్టీలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు మరియు అంబేద్కర్ జయంతి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !