రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 28న కరీంనగర్‌లో ‘మహాగర్జన’ – రెండు లక్షల మందితో సమరభేరి: పోలాడి రామారావు.

బాహు బలంన్యూస్ కరీంనగర్ : రాష్ట్రంలోని అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఈనెల 28న కరీంనగర్ వేదికగా ‘రైతు మహాగర్జన’ సమరభేరి సభను నిర్వహించనున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడించారు. సుమారు రెండు లక్షల మందితో పార్టీలకతీతంగా ఈ భారీ బహిరంగ సభను సక్సెస్ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్‌లో వివిధ జిల్లాల బాధ్యులతో సన్నాహక సమావేశం నిర్వహించిన ఆయన, అనంతరం సభకు మద్దతు కోరుతూ పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.
రాజకీయ పక్షాల మద్దతు కోరుతూ..
కరీంనగర్‌కు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో పోలాడి రామారావు కలిశారు. సభ ఆహ్వాన పత్రికను అందజేసి, రైతు పోరాటానికి సహకరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్.. రైతుల పక్షాన సాగే ఈ ధర్మ పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించి, సభ గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావును కలిసి ఆహ్వానించగా, రైతుల సంక్షేమం కోసం తాను ముందుంటానని ఆయన హామీ ఇచ్చారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పుట్ట మధు తదితరులు కూడా ఈ సభకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
డిమాండ్ల సాధనే ధ్యేయం..
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. పాలకులు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. “రాష్ట్రంలో కేవలం 30 శాతం మందికే రుణమాఫీ జరిగిందని, మిగిలిన 70 శాతం మందికి తక్షణమే మాఫీ వర్తింపజేయాలి” అని డిమాండ్ చేశారు. పంట సాగు సమయంలోనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సన్న రకాలతో పాటు అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని, గతంలో ఉన్న పాల ఉత్పత్తిదారుల రాయితీని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
సామాజిక సమస్యలపై గళం..
రైతు సమస్యలతో పాటు సామాజిక అంశాలపైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రామారావు పేర్కొన్నారు. రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన రైతులకు రూ. 6 వేల పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల, ఓసీ కార్పొరేషన్లకు పాలక మండళ్ల ఏర్పాటు, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ వంటి అంశాలను ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నేతలు ఏనుగు రవీందర్ రెడ్డి, గోపు సత్యనారాయణ రెడ్డి, కర్ర సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన సమరభేరి’ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పోరాటం. మద్దతు ప్రకటించిన రాష్ట్ర మహిళా సంఘాలు; 8 వేల మందితో హాజరవుతామని వెల్లడి. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !