కరీంనగర్ ‘రైతు మహాగర్జన’కు తరలిరండి: సబ్బండ వర్గాలకు రైతు ప్రజాసంఘాల జేఏసీ పిలుపు. ఓసి రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు .

bahubalamtv Reporter
bahubalamtv.in

కరీంనగర్ ‘రైతు మహాగర్జన’కు తరలిరండి: సబ్బండ వర్గాలకు రైతు ప్రజాసంఘాల జేఏసీ పిలుపు. ఓసి రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు .

బాహు బలంన్యూస్ కరీంనగర్ మార్చి 25: వచ్చే నెల 28వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి 'రైతుల మహాగర్జన' బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. సుమారు లక్ష మందితో నిర్వహించే ఈ భారీ సభకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతూ ఓసి రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి బృందం హైదరాబాద్‌లో పలు సామాజిక సంఘాల నేతలను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
బిసి సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, 57 ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు భైరి వెంకటేష్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల అధ్యక్షుడు తడగొండ సత్యరాజ్ వర్మ, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్ తదితరులను కలిసి సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విన్నపానికి సానుకూలంగా స్పందించిన నేతలు, వేలాది మందితో సభకు తరలివస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి రైతు జేఏసీ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తుతూ సమరభేరి
బుధవారం కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించిన పోలాడి రామారావు, సంధి తిరుపతి రెడ్డిలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులను తగ్గించడమే కాకుండా, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని వారు మండిపడ్డారు. అన్ని రకాల పంటలకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్న రకాలకే పరిమితం చేస్తూ రైతులను మోసగిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రెండు విడతల రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా నిధులు విడుదల చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నదాతలతో పాటు విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని వారు డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం, తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఏప్రిల్ 28న కరీంనగర్ వేదికగా లక్షలాది మందితో 'సమరభేరి' మోగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పెండ్యాల రాంరెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ కరీంనగర్ మార్చి 25: వచ్చే నెల 28వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి ‘రైతుల మహాగర్జన’ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. సుమారు లక్ష మందితో నిర్వహించే ఈ భారీ సభకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతూ ఓసి రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి బృందం హైదరాబాద్‌లో పలు సామాజిక సంఘాల నేతలను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
బిసి సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, 57 ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు భైరి వెంకటేష్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల అధ్యక్షుడు తడగొండ సత్యరాజ్ వర్మ, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్ తదితరులను కలిసి సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విన్నపానికి సానుకూలంగా స్పందించిన నేతలు, వేలాది మందితో సభకు తరలివస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి రైతు జేఏసీ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తుతూ సమరభేరి
బుధవారం కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించిన పోలాడి రామారావు, సంధి తిరుపతి రెడ్డిలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులను తగ్గించడమే కాకుండా, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని వారు మండిపడ్డారు. అన్ని రకాల పంటలకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్న రకాలకే పరిమితం చేస్తూ రైతులను మోసగిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రెండు విడతల రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా నిధులు విడుదల చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నదాతలతో పాటు విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని వారు డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం, తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఏప్రిల్ 28న కరీంనగర్ వేదికగా లక్షలాది మందితో ‘సమరభేరి’ మోగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పెండ్యాల రాంరెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !