బాహు బలంన్యూస్ హుజూరాబాద్ డిసెంబర్ 22
మండలం లోని గొర్రెలు మరియు మేకల పెంపకందారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ నెల 23వ తేదీ నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మండల పశువైద్య అధికారి డాక్టర్ పి. రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి మొదటి విడతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జీవాల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, గొర్రెల కాపరులు తమ జీవాలకు నట్టల నివారణ మందులు వేయించడం ద్వారా వివిధ రకాల వ్యాధుల నుండి కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని మండలంలోని పెంపకందారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మందుల పంపిణీ షెడ్యూల్ వివరాలు:
పశువైద్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న రంగాపూర్, శాలపల్లి గ్రామాల్లో మందుల పంపిణీ జరుగుతుంది. 24వ తేదీన కొత్తపల్లి, హుజరాబాద్, జూపాక, బత్తలపల్లి గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. క్రిస్మస్ సెలవు అనంతరం 26న సిర్సపల్లి, సింగపూర్ గ్రామాల్లో, 27న పెద్ద పాపయ్యపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లి, రాంపూర్ గ్రామాల్లో మందులు పంపిణీ చేస్తారు. 29వ తేదీన దమ్మక్కపేట, నర్సింగాపూర్ గ్రామాల్లో, 30వ తేదీన బోర్నపల్లి, చిన్న పాపయ్యపల్లి, కనుకుల గిద్దె గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చివరిగా 31వ తేదీన వెంకట్రావుపల్లి, తుమ్మనపల్లి, మాందాడిపల్లి గ్రామాల్లో గొర్రెలకు మందులు వేయనున్నారు. సింగపూర్, హుజరాబాద్ ప్రైమరీ వెటర్నరీ సెంటర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ పర్యవేక్షణ జరుగుతుందని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వెల్లడించారు.










