బాహు బలంన్యూస్ హుజురాబాద్, డిసెంబర్ 22:
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామ నూతన సర్పంచిగా మంతెన సుమలత సురేందర్ ఈరోజు ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. వారితో పాటు ఉప సర్పంచిగా బొల్లెవేణి అజయ్, మరియు వార్డు సభ్యులుగా ఎన్నికైన ఎడ్ల కుమార్, ఎలుకపెల్లి సాలయ్య, ఎడ్ల ప్రియాంక, దేవునూరి లక్ష్మి, గుజ్జుల శ్రీకాంత్, చింతరాజు, కంకణాల కుమారస్వామి, జూపాక కళ్యాణి, చెన్నోజు స్వరూప తదితరులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
అసంపూర్తి పనులపై తక్షణ దృష్టి
బాధ్యతలు స్వీకరించిన వెంటనే నూతన పాలకవర్గం కార్యాచరణలోకి దిగింది. గ్రామంలో నిర్మాణ దశలో ఉండి, అర్థాంతరంగా ఆగిపోయిన గ్రామ పంచాయతీ భవనాన్ని సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుమలత మాట్లాడుతూ.. నిధుల కొరత లేదా ఇతర సాంకేతిక కారణాలతో ఆగిపోయిన భవన నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు.
గ్రామాభివృద్ధి కమిటీ అభినందనలు
బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామాభివృద్ధి పట్ల చొరవ చూపిన సర్పంచిని, వార్డు సభ్యులను గ్రామాభివృద్ధి కమిటీ (VDC) సభ్యులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు దేవునూరి కిరణ్, ప్రధాన కార్యదర్శి కంకణాల పరశురాములు మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాలని కోరారు.
ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం:
పోతిరెడ్డిపేటను జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందుకోసం గ్రామస్థులందరి సహకారం కావాలని పాలకవర్గ సభ్యులు కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చందుపట్ల పరంధాములు, మాజీ ఎంపీటీసీలు నరుకుడు సామెల్, మంతెన శ్రీనివాస్, దేవునూరి బాబు, MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్, గూళ్ళ శ్రీనివాస్, మామిడి రమేష్, బైరెడ్డి సంపత్ రెడ్డి, గోలి రంగారెడ్డి, పొడిశెట్టి రాజ్ కుమార్, కొండూరి కిరణ్, మేకల ప్రసన్న కుమార్ రెడ్డి, కొండూరి ప్రదీప్, చందుపట్ల రాజమౌళి, కంకణాల కనకయ్య, ఎడ్ల సుమన్, చింత స్వామి మరియు గ్రామ ప్రముఖులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










