హుజురాబాద్ డివిజన్‌లోని ఎస్సీ వసతి గృహాల్లో ప్రవేశాలకు అవకాశం: ఉచిత విద్య, భోజన వసతి విద్యతో పాటు అన్ని సౌకర్యాలు! సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం.విజయ్ పాల్ రెడ్డి

బాహు బలంన్యూస్ (జిల్లా ప్రతినిధి కరీంనగర్)
హుజురాబాద్,జూలై 06: హుజురాబాద్ డివిజన్‌లోని 12 ప్రీ-మెట్రిక్, 2 పోస్ట్-మెట్రిక్ ఎస్సీ హాస్టల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం. విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అందుబాటులో ఉన్న ఖాళీలు:
ప్రీ-మెట్రిక్ హాస్టల్స్ (బాలుర, బాలికలు):
* హుజురాబాద్: బాలుర హాస్టల్‌లో 71, బాలికల హాస్టల్‌లో 78.
* జమ్మికుంట: బాలుర హాస్టల్‌లో 35, బాలికల హాస్టల్‌లో 82.
* వావిలాల: బాలుర హాస్టల్‌లో 88.
* వీణవంక: బాలుర హాస్టల్‌లో 70.
* రేకొండ: బాలుర హాస్టల్‌లో 77.
* చిగురుమామిడి: బాలుర హాస్టల్‌లో 81.
* నుస్తులాపూర్: బాలుర హాస్టల్‌లో 72.
* ఇందుర్తి: బాలుర హాస్టల్‌లో 78.
* తిమ్మాపూర్: బాలికల హాస్టల్‌లో 215.
పోస్ట్-మెట్రిక్ హాస్టల్స్ (కాలేజీ విద్యార్థులు):
* హుజురాబాద్: బాలుర హాస్టల్‌లో 170.
* జమ్మికుంట: బాలికల హాస్టల్‌లో 130.
కల్పించే సౌకర్యాలు, ప్రత్యేకతలు:
ఈ హాస్టల్స్‌లో చేరిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, నోట్‌బుక్స్, నాలుగు జతల దుస్తులు, బెడ్‌షీట్, కార్పెట్, షూస్, స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్స్, మరియు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తారు.
*పౌష్టికాహారం: ప్రతిరోజూ ఉదయం రాగి జావ/పాలు/పండ్లు, టిఫిన్, సాయంత్రం స్నాక్స్. వారానికి రెండుసార్లు (గురువారం, ఆదివారం) చికెన్ లేదా బగారా అన్నం. రాత్రి భోజనంలో అన్నం, ఆకుకూరలు/కాయగూరలు, పప్పు, రసం, మజ్జిగ, ఉడికించిన గుడ్డు.
* వసతులు: బంకర్ బెడ్స్, ప్లేటు, గ్లాసు, ట్రంక్ పెట్టె, దుప్పట్లు, పరుపు, దిండు, స్పోర్ట్స్ షూ, స్కూల్ షూ ఉచితంగా అందిస్తారు.
* కాస్మెటిక్ ఛార్జీలు: బాలురకు నెలకు రూ. 150-200, బాలికలకు నెలకు రూ. 175-275.
* అదనపు తరగతులు: పదవ తరగతి విద్యార్థులకు సైన్స్, గణితం, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో ట్యూటర్లచే ప్రత్యేక తరగతులు, స్టడీ మెటీరియల్స్.
* ఇతర సౌకర్యాలు: సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు, స్పోర్ట్స్ మెటీరియల్, టీవీ. విద్యా సంవత్సరంలో ఉచిత విజ్ఞాన విహారయాత్రలు.
దరఖాస్తు విధానం:
మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంతో పాటు, విద్యార్థి 4 ఫోటోలు, ఆదాయ ధృవీకరణ పత్రం, బోనఫైడ్ (ఒరిజినల్), ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ జతపరచాలి.
ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు, వివిధ స్వచ్ఛంద, సామాజిక సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు ఎస్సీ వసతి గృహంలో విద్యార్థులను చేర్పించుటలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజయ్ పాల్ రెడ్డి కోరారు.
మరిన్ని వివరాల కోసం హుజురాబాద్ డివిజన్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం. విజయ్ పాల్ రెడ్డిని 9399957766 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !