రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

bahubalamtv Reporter
bahubalamtv.in

రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

బాహు బలంన్యూస్ ప్రతినిధి హుజూరాబాద్, ఏప్రిల్ 19: మండలంలోని రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. చర్చి ఫాదర్ రెవ. డాక్టర్ పి.ఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలను సంఘ సభ్యులు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా బండ ప్రియాంక, బండ మాధవి, బొడ్డు హర్షవర్ధన్, బండ స్నేహ, శనిగరపు ప్రవీణ, తిరుగమల్ల కవిత, కూచన విష్ణువర్ధన్‌లు యేసు ప్రభువు చివరి మాటల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు యేసు మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు.
నలభై రోజుల ఉపవాస దీక్ష ముగింపు సందర్భంగా మాడుగుల ఆశీర్వాదం గారి స్నేహితులు సురేష్, సుజాత దంపతులు సంఘ సభ్యులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే, నెల్సన్ పాస్టర్ కుటుంబం నుండి ఎగ్ పప్స్, బండ రమేష్, మాధవి దంపతుల నుండి జ్యూస్‌ను అందించారు.
ఫాదర్ నెల్సన్ గారు గుడ్ ఫ్రైడే యొక్క ప్రత్యేక సందేశాన్ని భక్తులకు వినిపించారు. సంఘ క్వయర్ బృందం ఆలపించిన పాటలతో సంఘ సభ్యులు కన్నీటితో క్రీస్తును ఆరాధించారు. అనంతరం ఫాదర్ నెల్సన్ దంపతులు అందరికీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !