బాహు బలంన్యూస్ హైదరాబాద్, ప్రతినిధి ఏప్రిల్ 19: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను బేడ బుడగ జంగం సంఘం నేతలు ఈరోజు కలిశారు. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణలో నివసిస్తున్న బేడ బుడగ జంగాలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని వారు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా, ఏ గ్రూపులో 15 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆ గ్రూపులో మెజార్టీ కులమైన బుడగ జంగాలకు చైర్మన్ పదవిని ఇవ్వాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పత్తి భాషా శివ, రాష్ట్ర కో సెక్రెటరీ కళ్లెం ముత్తు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దేవుడు కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పెర జంగయ్య, మరియు కుల పెద్దలు పత్తి బసవయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 200