✍🏻బాబా సాహేబ్ అంబేద్కర్ జన్మించి ఉండక పోతే…..

✍🏻బాబా సాహేబ్ అంబేద్కర్
జన్మించి ఉండక పోతే…..

బాబాసాహెబ్ జన్మించి ఉండక పోతే .

గోండులు అడవి జంతువుల వెంట మాత్రమే పరుగెత్తుకు జీవించే వారు..
మాదిగలు చనిపోయిన జంతు చర్మాలను ఒలుస్తు, డప్పు వాయిస్తూ మాత్రమే జీవించే వారు…

మాలలు సుంకరి,నీరటి పనులను మాత్రమే చేస్తూ మనుగడ సాగించే వారు..

లంబాడాలు పశుపోషణలో సంచార జీవితం మాత్రమే గడిపే వారు…

కుమ్మరి కుండల చక్రం మాత్రమే తిప్పుతూ జీవించే వారు…

శాలవాళ్ళు చరఖా తిప్పుతూ మాత్రమే జీవించే వారు….

కమ్మరి కొలిమి లో సుత్తి కొడుతూ మాత్రమే జీవించే వారు…

వడ్రంగి కర్రలను మాత్రమే చెక్కుతూ జీవించే వారు…

ఒడ్డరి రాళ్ళు పగలగొడుతూ మాత్రమే జీవించే వారు…

మాలిలు తోటమాలి పనులు చేస్తూ మాత్రమే జీవించే వారు..

గొల్ల, కుర్మా లు గొర్రెలు,మేకల బర్రెలు వెంట మాత్రమే తిరుగుతు జీవించే వారు..

బోయలు పిట్టల వేటలో మాత్రమే జీవించే వారు…

బేస్తవారు నదులు,చెరువు ల గట్ల వెంబడి మాత్రమే కాలం వెల్లదీసేవారు…

గౌడ కులస్తులు చెట్లు గిసుకు తీసుకుంటూ ఉండేవారు…

తేలివారు గానుగ చుట్టూ తిరుగుతూ మాత్రమే గడిపేవారు…

చాకలి రేవులో బట్టలు ఉతుకుతు మాత్రమే జీవించే వారు…

మంగలి మసాజు చేస్తు,గడ్డాలు గీస్తు మాత్రమే జీవించే వారు…

కాపులు వ్యవసాయం వృత్తిగా జీవించే వారు…

ఎందుకంటే భారత రాజ్యాంగం కంటే ముందుభారత దేశంలో రాజ్యాంగంగా చెలామణి అయినది ‘మణుధర్మ శాస్త్రం లేదా మనుస్మృతి’.ఇది హిందు మతానికి పునాదిగ్రంథం .ఇది దేశంలోని క్రిందివర్గలైన Sc,St,Bc,లకు పై విధులను మాత్రమే నిర్దేశించింది.వీరికి చదువుతో పాటు ఎటువంటి హక్కులు ఇవ్వలేదు..

కాని బాబా సాహేబ్ రచించిన రాజ్యాంగం పై కులాలు వారికి విద్యా తో పాటు సర్వ హక్కులు కల్పించింది.. అందువల్లే పై కులాల వారు చదువుకొని..
ఉపాధ్యాయులైనారు..

డాక్టర్లు అయ్యారు..
ఇంజనీర్లు అయ్యారు..
IAS,IPS లు అయ్యారు..
మంత్రులయ్యారు..
కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులయ్యారు..
ప్రధానులయ్యారు…
రాష్ట్రపతులై రాజ్యమేలు తున్నారు..

ఒక వేళ బాబా సాహేబ్ అంబేద్కర్ జన్మించి ఉండక పోతే,,
తాను రాజ్యంగం రచించక పోతే…
సామాజికంగా అణచబడిన వర్గాల్లో ఈ మార్పు సాధ్య మయ్యే దా?
మేధావులారా ఒక సారి ఆలోచించండి..
మీ చరిత్ర మీరు తెలుసుకొండి..
జై భీమ్ జై భారత్

ఈరోజు అంబేడ్కర్ గారు తన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన రోజు.1951 సెప్టెంబర్ 27 న అంబేడ్కర్ గారు ఒబిసీలకు రిజర్వేషన్లు అమలు జరపాలని మరియు మహిళలకు మేలు చేసే హిందూ కోడ్ బిల్లును రచించిన అంబేడ్కర్ ఆ హిందూ కోడ్ బిల్లును అమలు జరపాలని కోరుతూ పార్లమెంట్ లో పోరాటం చేశారు. కాంగ్రెస్ హిందూ నాయకులు అంబేడ్కర్ ను అవమానించారు,వేధించారు.చివరకు అంబేడ్కర్ అసహనంతో తన మంత్రి పదవిని మహిళలు కోసం, ఒబిసీల కోసం త్యాగం చేసారు. ఏ సమాజం కోసం అయితే ఆయన శ్రమించారో ఆ సమాజం ఆయన గురించి చదవకుండా దేవుడు, దేవతలు అంటూ లేదా మనువాదుల కపట మాటలను నమ్ముతూ ఇంకా మోసపోతూనే ఉన్నారు.అంబేడ్కర్ ను ద్వేషించే వాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు.

మానవ హక్కుల పోరాట యోధుడు*
2) గొప్ప మానవతావాది
4) సోషల్ థెరపిస్ట్
5) ప్రపంచ ఆభరణాలు
6) జ్ఞానం యొక్క చిహ్నం
7) రాజకీయ నిపుణుడు
8) సామాజిక శాస్త్రవేత్త
9) ఆర్థికవేత్త
10) చరిత్ర నిపుణుడు
11) ప్రఖ్యాత ఆలోచనాపరుడు
12) ప్రపంచ మానవ
13) ఆధునిక భారతదేశం యొక్క నిర్మాత
14) భారత్ రత్న రాజ్యాంగ శిల్పి
15) బౌద్ధ ధర్మ పునరుజ్జీవనం
16) ఆధునిక నిపుణుడు
17) అకడమిక్
18) న్యాయ నిపుణుడు
19) ఆడ స్వేచ్ఛావాది
20) ప్రసిద్ధ రచయిత
21) గొప్ప వక్త
22) అద్భుతమైన రచయిత
23) బోధిసత్వుడు
24) క్రమశిక్షణా సిపాయి
25) ఉద్యమం
26) హేతువాది
27) సోషలిస్ట్
28) సమతౌల్య
29) జ్ఞానోదయం
30) తత్వవేత్త
31) సాహిత్యం
32) అహింసా
33) విప్లవాత్మక
34) విశ్వం
35) గురువు
36) ఇంగ్లీష్ పండితుడు
37) బహుభాషా
38) యుగం
39) నీటిపారుదల నిపుణుడు
40) హరిత విప్లవం
41) దయగలవాడు
42) ప్రజాస్వామ్యవాది
43) శాస్త్రీయ సలహాదారు
44) కార్మికుల అదృశ్యం
45) పేదల బంధువు
46) టెలిస్కోప్
47) పేరున్న జర్నలిస్ట్
48) రైతు భాగస్వామి
49) కుల వ్యవస్థను తిప్పికొట్టడం
50) మార్పిడి ప్రారంభ
51) అగ్రగామి జాతీయవాది
52) బహుజన్ నాయకుడు
53) ఆడంబరం
54) ప్లానర్
55) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త
56) సమానత్వం యొక్క బిగినర్స్
57) పర్యావరణవేత్త
58) నిజమైన భారతదేశం యొక్క తండ్రి
59) నిజమైన దేశభక్తుడు
60) లైట్ ఆఫ్ ఇండియా
61) గొప్ప యాక్షన్ ఫిగర్
62) కేవలం యాభై సంవత్సరాలలో 3000 సంవత్సరాల బానిసత్వాన్ని రద్దు చేసిన గొప్ప చరిత్ర పురుషుడు

_మహనాయక_భీమ్ రావు బాబాసాహెబ్_అంబేద్కర్.

జై భీమ్

✊✊✊✊✊✊

గాంధీ విగ్రహానికి దండలేసి దండం పెట్టే దళితుల్లారా ఆయన నీ జాతికి చేసిన మోసం గురించి ముందు తెలుసుకో

👉అసలు ఆ గాంధీ ఎవరో ఆయన నీ జాతికి చేసిన మోసం ఏమిటో తెలిస్తే నువు గాంధీ విగ్రహానికి దండలు వేర్లు,ఆయన విగ్రహం పెట్టించానని గొప్పలు పోవు కదా అసలు అటువైపుగా కూడా వెళ్ళవు అసహ్యించుకుంటావు .ఎందుకో తెలుసుకో.

1.దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చే రామ్సే మెగ్డోనాల్డ్ అవార్డును వ్యతిరేకించి ఎరవాడ జైలులో దొంగ నిరాహార దీక్షపూని అంబెడ్కర్ గారి మీద ఒత్తిడి తెచ్చి పూనా ఒప్పందం పేరుతో దళితుల జీవితం చీకటి మయం చేసిన ఘనుడు నువు విగ్రహం పెట్టించి పూజలు చేసే గాంధీ.

2. అంటరానితనాన్ని లోలోపల సమర్థిస్తూ పైకీ మాత్రం అంటరానితనం నశించాలంటూ వారికి హరిజనులు అని ముద్ర వేసిన ఘనుడు గాంధీ.

3. అంబెడ్కర్ గారు కులం,మతం,ఆదాయం,లింగం,చదువు చూడకుండా వయోజనులకు ఓటుహక్కు ఇవ్వాలని వాదిస్తే పటేల్ అతని అనుచరులతో కేవలం ఆధిపత్య కులాల వారికి, ఇన్కమ్ టాక్స్ కట్టేవారికి,డిగ్రీ చదివిన వారికే ఓటుహక్కు ఇవ్వాలని దొంగదీక్షలు చేసి ముప్పుతిప్పలు పెట్టిన దళిత ద్రోహి గాంధీ.

4.మనువాదానికి కొమ్ము కాస్తూ కులవ్రుత్తులను ప్రోత్సహించి కులవ్యవస్థ కొనసాగాలని వారు పరిపాలనలో ఉద్యోగాలలో ఉండకూడదని నిగూఢంగా కోరుకున్న వ్యక్తి మీరు విగ్రహం పెట్టే గాంధీ.

5. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని పైకి చెబుతూ లోలోపల ఆ పల్లెలే కులవ్యవస్థకు మంచి పునాదులు అని చెప్పి కులవ్యవస్థను బలంగా కోరుకున్న వ్యక్తి గాంధీ.

6.దళితులు ఆధిపత్య కులాలు కలిసే ఉన్నారు రామనామం లోనే ముక్తి ఉందని చెబుతూ హిందూమత దూరాచారాలను లోలోపల సమర్థించిన ఘనుడు గాంధీ.

పై వాటిని ఎదురించి రాజ్యాంగం రాసి ఆర్టికల్ 17 ద్వారా అస్ప్రుస్యతను రూపుమాపి,ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నీకు ఓటుహక్కు, విద్య, ఉద్యోగం కల్పించిన దేవుడు అంబెడ్కర్ గారు.నువు ఆయన విగ్రహం పెట్టకపోయినా పర్వాలేదు కానీ నీ జాతికి ద్రోహం చేసిన వారికి పూజలు చేసి చెంచాలా మారకు.ఇది నా ఆవేదన విన్నపం

నహీ చలేగా ..నహీ చలేగా
**********************
మగ్గాలు మాకు, పగ్గాలు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

గీత చెట్లు మాకు, గునులు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

కత్తులు మాకు, కాసులు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

వలలు మాకు, వ్యవస్థలు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

నాగళ్ళు మాకు, నగరాలు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

కొడవళ్ళు మాకు, కంప్యూటర్లు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

గుడిసెలు మాకు, గడీలు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

ఆసరా మాకు, ఆస్తులు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

పాటలు మాకు, పాలన మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

కైకలు మాకు, కార్పొరేట్లు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

సమ్మెట మాకు, సాఫ్ట్వేర్ మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

అడవులు మాకు, భూములు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

ఆరెలు మాకు, ఆలయాలు మీకా!
నహీ చలేగా.. నహీ చలేగా…

కొలుములు మాకు, కొలువులు మీకా!
నహీ చలేగా.. నహీ చలేగా…

డప్పులు మాకు, డాలర్లు మీకా!
నహీ చలేగా.. నహీ చలేగా…

చాకిరేవు మాకు, చదువులు మీకా!
నహీ చలేగా.. నహీ చలేగా…

అడ్డాలు మాకు, అంతస్తులు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

వృత్తులు మాకు, వ్యాపారాలు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

కష్టం మాకు, ఫలితం మీకా!
నహీ చలేగా.. నహీ చలేగా…

సిత్రాలు మాకు, సినిమాలు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

రేపులు మాకు, రేటింగులు మీకా!
నహీ చలేగా.. నహీ చలేగా…

హత్యలు మాకు, హార్మ్యాలు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

అవమానాలు మాకు, అందలాలు మీకా!
నహీ చలేగా..నహీ చలేగా…

ఆటోలు మాకు, ఆడీలు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

టాక్సీలు మాకు, టెక్కులు మీకా!
నహీ చలేగా… నహీ చలేగా…

పచ్చళ్ళు మాకు, పాయసం మీకా!
నహీ చలేగా.. నహీ చలేగా…

గొర్రెలు మాకు, గొల్కొండ మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

బర్రెలు మాకు, బంగ్లాలు మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

సంచారం మాకు, సంపద మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

తండాలు మాకు, బంజారా హిల్స్ మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

రక్తం మాకు, రాష్ట్రం మీకా!
నహీ చలేగా ..నహీ చలేగా…

ఓట్లు మావి, సీట్లు మీవా!
నహీ చలేగా ..నహీ చలేగా…

.
.
.
.
” అంబేద్కర్‌ ” ఇది ఓ పేరు కాదు
మనం ఎన్ని జన్మలెత్తినా చేరుకోలేని “మహాశిఖరం ”
కోట్లాది యేళ్లు తపస్సు చేసినా సాక్షాత్కరించని “మహిమాన్వితరూపం”

ఆయనిది “పుట్టుక” కాదు…. మన నిత్య నరకాన్ని తప్పించిన “వరం”
ఆయనిది “బాల్యం” కాదు..మనమెవ్వరం చేయలేని ” శోక ప్రయాణం”
ఆయనిది “యవ్వనం” కాదు… మన భవితకై ” వెలకట్టలేని త్యాగం”
ఆయనిది “జీవితం” కాదు… తడి ఆరని “పచ్చి నెత్తుటి గాయం”
ఆయనిది “మరణం” కాదు…. మనకై ” కొడిగట్టిన అఖండ దీపం” ఆయనిది “గతించిన చరిత్ర” కాదు . . . .
మనం తలెత్తుకు తిరుగుతున్న ” వర్తమానం ”

” అంబేద్కర్‌ ” అంటే “అమ్ముకునే సరుకు” కాదు
” అంబేద్కర్‌ ” అంటే ” అంతులేని శక్తి ”
” అంబేద్కర్‌ ” అంటే ” నిత్య సత్య స్ఫూర్తి ”
” అంబేద్కర్‌ ” అంటే తాడిత, పీడితులకు ” మార్గదర్శి ”
” అంబేద్కర్‌ ” అంటే నువ్వు, నేను ఎన్నో కలలు కంటున్న ” జీవితం ”
ఆయన గురించి అధ్యయనం చేయకున్నా పర్లేదు . . . అమ్ముకోకండి .!!
ఆయనను ఆచరించకున్నా పర్లేదు. . . . నడి వీధికి లాగకండి….
🙏🙏🙏 Jai bheem 🙏🙏🙏జై భీమ్,,,,,,

ఈ దేశానికి
దశ ,
దిశ
అన్నీ బాబా సాహెబ్ అంబేడ్కర్ మాత్రమే ……
మనం చదివే చదువు
మనం సంపాదించే డబ్బు
చేసే ఉద్యోగం అన్నీ బాబా సాహెబ్
ముఖ్యం గా 1950 లకంటే ముందు
SC , ST , BC , Minority కి
నిరకరించబడిన
అన్ని అవకాశాలని
సమాజం లో
ఆత్మ గౌరవం తో బ్రతికేలా కృషి చేసిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేడ్కర్ మాత్రమే

ఏ దేవుడు మన స్థితి గతులను మార్చలేదు
ఏ హీరో మన బ్రతుకులను మార్చలేదు
ఏ రాజకీయ నాయకుడు మార్చలేదు

మనకి విలువ , సమాజం లో గుర్తింపు గా బ్రతుకు తున్నాం అంటే అది కేవలం బాబా సాహెబ్ భారత రాజ్యాంగం వల్లనే

అందుకే
ఈ దేశానికి
అంబేడ్కరిజమే శరణ్యం

ఈ రోజు విదేశాల్లో చదువుతున్నా
కాంట్రాక్టు , పారిశ్రామిక రంగాల్లో వెలుగొందుతున్నా

విద్యా , వైద్య రంగాల్లో రాణిస్తున్న
అన్ని కేవలం బాబా సాహెబ్ అంబేడ్కర్ చేసిన మహోన్నత పోరాట కృషి ఫలితమే

అన్ని చేసిన బాబా సాహెబ్ అంబేడ్కర్
ప్రపంచం లోనే ఇప్పటి వరకు ఎవరు చదవని అన్ని డిగ్రీ లు చేసి చరిత్ర లో నిలిచారు

కుల , మత , వర్గ
బేధాలు ఉన్న

ఓటు హక్కుతో
అందరూ సమానమే అని మన అందరిని సమానం చేశారు

అంబానీ వేసిన ఓటు అయినా
రిక్షా తొక్కే వాళ్ల ఓటు అయినా సమానమే ………..

బాబా సాహెబ్ అంబేడ్కర్
వల్ల సమాజం లో ఒక మనిషిగా బ్రతుకున్న మనం ఎటు వైపు ఆలోచిద్దాం
ఇక నైనా నిజ , నిజాలు పరిశీలించి
ఈ దేశానికి అంబేడ్కరిజమే శరణ్యం అని గ్రహించండి

జై భీం
జై బాబా సాహెబ్ అంబేడ్కర్
జై భారత రాజ్యాంగం

జై భీమ్

ఆర్థికవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి ఏమి ఇచ్చారు?

1. కార్మికులకు ప్రాథమిక సేవలు అందుబాటులో ఉన్నాయి
2. వర్కర్స్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI)
3. 12 గంటల నుండి 8 గంటల పని
4. ట్రేడ్ యూనియన్ గుర్తింపు
5. పెయిడ్ లీవ్‌తో పాటు
6. డీఏ
7. చట్టపరమైన సమ్మెకు హక్కు
8. ఆరోగ్య భీమా
9. కార్మిక సంక్షేమ నిధి
10. భవిష్య నిధి
11. సంరక్షక హక్కు
12. విడాకుల హక్కు
13. ప్రసూతి సెలవు
14. మహిళలకు ఆస్తి హక్కు
15. స్త్రీ, పురుషులకు సమానమైన పని, సమాన వేతన హక్కులు ఉన్నాయి
16. తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు
17. మహిళా కార్మిక రక్షణ చట్టం
18. ఓటు హక్కు
19. భారతీయ గణాంక చట్టం
20. సాంకేతిక శిక్షణ పథకం
21. కేంద్ర సాంకేతిక శక్తి బోర్డు
22. పవర్ గ్రిడ్ వ్యవస్థ
23. రాష్ట్ర డివిజన్ కమిషన్
24. కేంద్ర నీటిపారుదల కమిషన్
25. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు
26. రివర్ లింకేజ్ ప్రాజెక్ట్
27. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్
28. హిరాకుండ్ ఆనకట్ట
29. భక్రా-నంగల్ ఆనకట్ట
30. సోనెక్ రివర్ ప్రాజెక్ట్
31. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
32. ఉపాధి మార్పిడి

ఇంతటి త్యాగమూర్తి ఫోటో తో వ్యాపారం చెయ్యటం భావ్యమా
.. ………………………….

జై భీమ్

✊జై భీమ్.! ఆంటే…!?
——————————
👉జై భీమ్… రెండక్షరాల పదం కాదది,
వేల సంత్సరాల బానిసత్వ విముక్తి పోరాటమది.

👉ఊరి నడివీదులగుండా నడిపించిన నాయకత్వమది.

👉అణిచివేతలను వివక్షతలను ఎదిరించిన ధిక్కారమది!

👉తలలపై తలపాగలు నిషేధమైన చోట,
చేతులతో చెప్పులు మోసిన చోట,
ఎటకారపు పిలుపులకు మదిజచ్చిన చోట,
తిరుగుబాటు నినాదమది

👉ఆధిపత్యం ఎదురైన వేల,
తలొంచిన మనిషికి
నిటారుగా నిలబడడం నేర్పిన ధైర్యమది.

👉మనిషిగా చూడబడని చోట,
మేమూ.. మనుషులమేనని నిలదీసిన ప్రశ్న అది.

👉అక్షరాన్ని ఆసరాగా జేసుకొని,
అవని నుండి ఆకాశం దాకా ఎదిగే స్వేచ్ఛ అది.

👉అవకాశాలుంటే.. ఎవరెస్టు శిఖరాలను అధిరోహించే సాహసమది.

👉జాతి జనులు మారుటకు విద్యనందించిన జ్ఞానమది.

👉అంటరాని పెంటల నుండి పెనుమంటలై,
“మనువుని” దహించిన జ్వాల అది.

👉ఈ దేశం అందరిదని నినాదించిన హక్కుల గొంతుకది.

👉నేడు… భారతీయతను సంతరించుకుంటున్న
జాతీయ నినాదమది.

జైభీమ్ అంటే.. ఆకర్షణ.
జైభీమ్ అంటే.. సంఘర్షణ.
జైభీమ్ అంటే.. ఆచరణ.
జైభీమ్ అంటే.. సమీకరణ.
జైభీమ్ అంటే.. బోధన.
జైభీమ్ అంటే.. పోరాటం.
జైభీమ్ అంటే.. విప్లవం.
జైభీమ్ అంటే.. హేతువాదం.
జైభీమ్ అంటే.. మనిషిని మనిషిగా చూడాలనే..
ఒక మహోన్నత మానవతా వాదం.
✊✊✊✊✊✊

కులం ఎక్కడది?? అనే అనేటోళ్ళు మరీ దీనికేం అంటరో.!!!!…🤔🤔

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే గనకా రాజ్యాంగ రచన నాకెందుకులే అని ఒకసారి అనుకోని ఉంటే బహుజనుల బతుకులు బుక్కెడు మెతుకులకోసం బోకెలు పెట్టె పరిస్థితి ఈ కంప్యూటర్ కాలంలో కూడా కండ్లముందే కదలాడుతుండేది…. ఈ రోజున మనం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నమంటే, మన 5 వేళ్ళలతో కడుపునిండా తిండి తినగలుగుతున్నాం అంటే,, హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే,,,, అగ్రవర్ణాలకు ఏమాత్రం తగ్గకుండా హుందాగా ఉండగలుగుతున్నాం అంటే,,,, అది కేవలం… కేవలం… అంబేద్కర్ తన దేహాన్ని బహుజన సమాజం కోసం తనను తాను కాగడాల వెలిగించుకున్నాడు కాబట్టే ఈ ఈ భూమిమీద మన సమాజాన్ని ఏ శక్తి కూడా తాకలేకపోతుంది…

కానీ అంతటి త్యాగమూర్తి త్యాగ ఫలాలను కోరుకుంటున్నామే తప్పా…!!! ఆయన ఆత్మగౌరవ పోరాటానికి అనువంతనైనా అండగా నిలవలేకపోవటం బహుజన నీతికి, నిజాయితికి, విజ్ఞాతకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి….

శభాష్ బహుజన 🙏🙏🙏

బాబాసాహేబ్ రాజ్యాంగము కంటే ముందు……
👉🏿మాదిగ కులంలో మాదిగలే జన్మించారు.
👉🏿రెడ్డీ కులంలో రెడ్డిలే జన్మించారు.
👉🏿మాల కులంలో మాలలే జన్మించారు.
👉🏿గౌడ కులంలో గౌడ్లే జన్మించారు.
👉🏿సాకలి కులంలో సాకలి వారే జన్మించారు.
👉🏿ముస్లీంల ఇంట్లో ముస్లీంలే జన్మించారు.
👉🏿మంగలి కులంలో మంగలోల్లే జన్మించారు.
👉🏿బెస్త కులంలో బెస్తలే జన్మించారు..
👉🏿 ఎరుకల కులంలో ఎరుకలోల్లే జన్మించారు.
ఈ విదంగా ఏ కులంలో ఆ కులంవారే జన్మించారు…
కానీ……..బాబాసాహెబ్ అంబేడ్కర్ 1891 ఏప్రియల్ 14 న భారత దేశంలో పుట్టాడో
ఎప్పుడైతే అంబేడ్కర్ ద్వారా రాజ్యాంగము వచ్చిందో అప్పటినుండి మెుత్తం తలకిందులైంది…..
👉🏿 ఇపుడు మాదిగ కులంలో IAS జన్మిస్తున్నాడు.
👉🏿 ఇపుడు రెడ్డీ ,కమ్మ కులంలో రాష్టానికి ముఖ్యమంత్రి జన్మిస్తున్నాడు.
👉🏿ఇపుడు మాల కులంలో IPS జన్మిస్తున్నాడు.
👉🏿ఇపుడు గౌడ కులంలో హోమ్ మినిష్టర్ జన్మిస్తున్నాడు.
👉🏿ఇపుడు సాకలి కులంలో యుానివర్సిటి వైస్ ఛాన్స్ లర్ జన్మిస్తున్నాడు.
👉🏿ఇపుడు ముస్లీంల ఇంట్లో రాష్ట్రపతి జన్మిస్తున్నాడు.
👉🏿ఇపుడు మంగళి కులంలో IFS జన్మిస్తున్నాడు..
👉🏿ఇపుడు బెస్త కులంలో హైకోర్ట్ న్యాయవాది జన్మిస్తున్నాడు. ఇపుడు ఇందులోనే ప్రదాన మంత్రి జన్మించాడు.
👉🏿ఎరుకల కులంలో IRS జన్మిస్తున్నాడు.
👉🏿చుాశారా! అంబేడ్కర్ గారి రాజ్యాంగానికి
బ్రాహ్మణుని మనుధర్మ శాస్త్రానికి వున్న తేడా…..ఇలాంటివి కోకొల్లలు…
ఇపుడు ఇంకొక పరిణామము ఏమనగా అంబేడ్కర్ గారి రాజ్యాంగంలో బ్రాహ్మణ చెప్రాసీలు, అటెండర్లు కుాడా జన్మిస్తున్నారు…..
ఆ మహనీయుడు మనదేశానికి చేసిన త్యాగానికి , ఈ దేశం లోని is అనేక ప్రయోజనాలు పొందిన కులాలు ,బాబాసాహెబ్ కిచ్చే గౌరం ఏమిటి??? కృతజ్ఞతను మరచిన సమాజానికి బుద్ది చెపుదాం, బాబాసాహెబ్ వారసులమైన మనం ఆయన ఆశయాలను నెరవేరుద్దాం!!!సమ సమాజ స్థాపనకై ఉద్యమిద్దాం
ఉధ్యోగులారా!!పెద్దల్లారా,మహిళ్లారా,విద్యార్థులారా!!
యువతి యువకుల్లారా !!
జై భీమ్!!

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !