🔔 సామాజికం 🔔

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🔔 సామాజికం 🔔

▪తాజా అన్నం మాయం.

▪తాజా కూరలు మాయం.

▪కోడళ్ళ పనితనం మాయం.

▪అత్తమామల మాటసాయం మాయం.

▪అల్లుళ్ళ గౌరవ హోదా మాయం.

▪పోస్టుమాన్ మాయం.

▪ఆసాంతం వినే వైద్యుడు మాయం.

▪చీర, రవిక మాయం.

▪పుస్తక పఠనం మాయం.

▪రేడియోకి శ్రోతలు మాయం.

▪పెరడు బావి మాయం.

▪సైకిలు మాయం.

▪ఎండావకాయ మాయం.

▪కుంపటిపై దిబ్బరొట్టి మాయం.

▪మట్టి వాసన మాయం.

▪పిడతకింద పప్పు బండి మాయం.

▪వందరోజులాడే సినిమాలు మాయం.

▪అర్ధరాత్రయినా నిశ్శబ్దం లేని నిశిరాత్రులు మాయం.

▪వెంట ఉండే ఉపాధ్యాయుడు మాయం.

▪కుంకుడు కాయ, సీకాకాయ మాయం.

▪వాకిట అలుకుళ్ళు, ముగ్గులు, పూల మొక్కలు మాయం.

▪పిచ్చుకలు, సీతాకోకచిలుకలు మాయం.

▪సత్తు గిన్నె చారు మాయం.

▪స్కూల్లో మైదానం మాయం.

▪సంఘంలో పరోపకారం మాయం.

▪వానపాము మాయం.

▪చెరువుల్లో ఆటలు మాయం. అసలు చెరువులే మాయం.

▪ చింతపిక్కలాట, అచ్చంగిల్లాట, తొక్కుడు బిళ్ళలు ఆటలు, కోతికొమ్మచ్చి, కబడ్డీ మాయం.

▪గోడిం బిళ్ల / కర్ర – బిళ్ల మాయం, దాక్కుంటే దొంగాట మాయం.

▪అవ్వలు, బామ్మలు కబుర్లు, కథలు మాయం.

▪థూళి లేని గాలి మాయం.

▪పాళీ ఉన్న పెన్ను మాయం.

▪ పెద్దల మాటలు మాయం, పెద్దల సలహాలు మాయం, ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం.

▪నిలకడగా కురిసే వాన మాయం.

▪నిర్మానుష్యమైన ఏకాంతం మాయం.

▪కంటికి నిద్ర మాయం.

▪వెన్నెల చూడాలనే కన్నులు మాయం.

▪ ఏకాగ్రత మాయం.

▪హారన్ మోత లేని వీధి మాయం.

♦దోమలు లేని పార్కులు మాయం.

▪తోటమాలి కొలువే మాయం.

▪దాచుకుందా మంటే వడ్డీరేటు మాయం. అసలే మాయం.

▪”ఒక అల్లం పెసరె” అని కేక వేసే పాక హోటల్ మాయం.

▪సగం సగం పంచుకునే తేనీరు మాయం.

▪నిఖార్సయిన చెగోడీ, వడియం, అప్పడం మాయం. కూర్చుని తినే పంక్త భోజనాలు మాయం.

▪ప్రేమ ప్రకటించే ప్రేమ లేఖలు మాయం.

▪సాయంకాలం మల్లెపువ్వులు పెట్టుకుని కాటన్ చీరతో స్వాగతించే ధర్మపత్ని మాయం. ఎందుకూ…పంచ కట్టు, లుంగీతో, చక్కటి షేవింగ్ తో ఉండే భర్త మాయం.

▪ఆఫీసు నుండి రాగానే నాన్నా నాకేమి తెచ్చావు అని ఎదురుపడే‌ సంతానం మాయం.

▪ఏమండీ రాత్రికి ఏమి చేయమంటారు అని అడిగే ధర్మపత్ని మాయం. ఈ పండక్కి నాకేం కొనిస్తారని భార్య కోరికలు మాయం.

**ఆత్మీయతలు మాయం, అనుబంధాలు మాయం,

▪ కుటుంబ సభ్యులు నలుగురు కూర్చొని మాట్లాడే కాలం మాయం..

అందుకే ఎవరికి వాడు,
ఎవరి చారవాణి లోకి వాళ్ళు మాయం. మాయం మాయం.

మనదైన సమయం మాయం.

*సర్వం మాయం.
🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !