శ్రీ కామాక్షి అమ్మవారికి మకర తోరణం బాహుకరణ.. దేవాలయంలో ప్రత్యేక అభిషేకం శరన్నవరాత్రుల అమ్మవారి అలంకారాల కోసం

బాహుబలం న్యూస్ సైదాపూర్ అక్టోబర్ 03.:
సైదాపూర్ మండలం వేన్కేపల్లి గ్రామంలో
కామాక్షి అమ్మవారి దేవాలయంలో నందు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి గురువారం పురస్కరించుకొని ఈరోజు ఉదయం 10:45 నిమిషాలకు పంచమృతాలతో సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం జరుపబడినది.
వేన్కేపల్లి వాస్తవ్యులు పేరాల సత్యనారాయణ సరస్వతి దంపతులు అమ్మవారి కి ఇత్తడి మకర తోరణం తయారు చేయించారు. దానిని వారి అల్లుడు సబ్బని వెంకటాస్వామి – వరలక్మి దంపతులు బహూకరించారు.

మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః, ఓం హ్రీం శ్రీం కా ఈఐ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీంమంత్రం: ॐ హరిమ్ శ్రీం కా ఈ ..

అమ్మ శక్తి దేవి అవతారం. శివుని భార్యగా, ఆమెను దక్షిణ భారతదేశంలో కామాక్షి అని మరియు తూర్పున కామాఖ్య అని పిలుస్తారు. పేరు అంటే వాంఛనీయుడు లేదా అక్షరాలా కోరికతో నిండిన వ్యక్తి అని అర్థం. ప్రేమ దేవుడైన కామాన్ని నాశనం చేయడానికి శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. శివుడు నాశనం చేసేది మరియు ప్రతిఘటించేది అతని బెటర్ హాఫ్‌గా మారుతుంది – అన్నీ ఒక మలుపుతో! కామం బూడిద నుండి ఉద్భవించిన రాక్షసుడిని కామాక్షి సంహరించిం దని నమ్ముతారు.

ఆశ్వయుజ శుక్ల పాడ్యమి గురువారం అక్టోబర్ 3వ తేదీ నుంచి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమై అక్టోబర్ 12వ తేదీతో ముగియనున్నాయి. పాడ్యమి నుంచి దశమి వరకు జరిగే ఈ నవరాత్రుల్లో వివిధ అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే ఆయా రోజుల్లో పలు రకాల నైవేధ్యాలను అమ్మవారికి భక్తులు సమర్పించనున్నారు.
ఈ దసరా వేడుకలకు వేన్కేపల్లి గ్రామంలో శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయంలో కొలువు దీరిన దుర్గమ్మను…

అమ్మలగన్నయమ్మ,ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ,సురారులమ్మ,కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్…అంటూ భక్తులు పూజించనున్నారు.
ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు పండితులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !