ఆగస్టు 6న హుజురాబాద్ మండల స్థాయి ప్రగతి సమీక్షా సమావేశం.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఆగస్టు 6న హుజురాబాద్ మండల స్థాయి ప్రగతి సమీక్షా సమావేశం.

బాహు బలంన్యూస్,హుజురాబాద్, ఆగస్టు 04:
హుజురాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 2:00 గంటలకు మండల ప్రత్యేకాధికారి (ఆర్‌డీవో) అధ్యక్షతన ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తూర్పాటి సునీత తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ప్రతి 45 రోజులకు ఒకసారి ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవనం, వి.బి. రాంజీ, జలసిరి, వనమహోత్సవం, విద్య, వైద్యారోగ్య, పశుసంవర్ధక, విద్యుత్, స్త్రీ-శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ, నీటిపారుదల, ఐకేపీ (SERP), రహదారులు & భవనాల శాఖ (R&B), గ్రామీణాభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ-నిత్యావసర వస్తువుల పంపిణీ, ఎక్సైజ్, అటవీ, ఆర్‌టీసీ, సాంఘిక సంక్షేమం తదితర 20కి పైగా శాఖల ప్రగతిపై సమగ్రంగా సమీక్షించనున్నారు.
సమావేశానికి మండలంలోని గౌరవ సర్పంచులు, మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. అలాగే, సంబంధిత మండల స్థాయి అధికారులు తమ శాఖల అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను (40 ప్రతులు - A4 సైజులో) ఆగస్టు 5వ తేదీలోగా ఎంపీపీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్,హుజురాబాద్, ఆగస్టు 04:
హుజురాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 2:00 గంటలకు మండల ప్రత్యేకాధికారి (ఆర్‌డీవో) అధ్యక్షతన ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తూర్పాటి సునీత తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ప్రతి 45 రోజులకు ఒకసారి ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవనం, వి.బి. రాంజీ, జలసిరి, వనమహోత్సవం, విద్య, వైద్యారోగ్య, పశుసంవర్ధక, విద్యుత్, స్త్రీ-శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ, నీటిపారుదల, ఐకేపీ (SERP), రహదారులు & భవనాల శాఖ (R&B), గ్రామీణాభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ-నిత్యావసర వస్తువుల పంపిణీ, ఎక్సైజ్, అటవీ, ఆర్‌టీసీ, సాంఘిక సంక్షేమం తదితర 20కి పైగా శాఖల ప్రగతిపై సమగ్రంగా సమీక్షించనున్నారు.
సమావేశానికి మండలంలోని గౌరవ సర్పంచులు, మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. అలాగే, సంబంధిత మండల స్థాయి అధికారులు తమ శాఖల అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను (40 ప్రతులు – A4 సైజులో) ఆగస్టు 5వ తేదీలోగా ఎంపీపీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !