సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం మెంబర్‌గా సబ్బని రమేష్. … ఘనంగా సన్మానించిన ‘TFTD’ స్టేట్ ఆర్గనైజర్ సందేల వెంకన్న ..

bahubalamtv Reporter
bahubalamtv.in

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం మెంబర్‌గా సబ్బని రమేష్. … ఘనంగా సన్మానించిన ‘TFTD’ స్టేట్ ఆర్గనైజర్ సందేల వెంకన్న ..

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 12:
హుజురాబాద్ ముద్దుబిడ్డ సబ్బని రమేష్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం మెంబర్‌గా నియామకమవడం పట్ల పట్టణంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ పట్టణంలోని స్థానిక టాప్రా (TAAPRA) కార్యాలయంలో తెలంగాణ ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ జేఏసీ (TFTD) స్టేట్ ఆర్గనైజర్ సందేల వెంకన్న ఆధ్వర్యంలో రమేష్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సిటిజన్ ఫోరం గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​హుజురాబాద్‌కు దక్కిన గౌరవం
​ఈ సందర్భంగా తెలంగాణ సిటిజన్ ఫోరం గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, TFTD అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజర్ సందేల వెంకన్న మాట్లాడుతూ.. హుజురాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ మెంబర్‌షిప్ దక్కడం స్థానికంగా ఎంతో గర్వకారణమని కొనియాడారు. రమేష్ గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలోపేతానికి, సిద్ధాంతాలకు కట్టుబడి నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. ఆయన పడిన కష్టానికి, పార్టీ పట్ల చూపిన నిబద్ధతకు గుర్తింపుగానే ఈ ఉన్నతమైన పదవి లభించిందని వారు స్పష్టం చేశారు.
​ రాష్ట్రస్థాయిలో కీర్తి పతాకం .
​రమేష్ నియామకం ద్వారా హుజురాబాద్ కీర్తి పతాకం రాష్ట్రస్థాయిలో ఎగిరిందని నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆయన మరింత రెట్టింపు ఉత్సాహంతో అటు పార్టీకి, ఇటు సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఫిలిం బోర్డ్ మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేష్.. సమాజానికి మేలు చేసే, సాంస్కృతిక విలువలను పెంపొందించే మంచి చిత్రాలకు ఆదరణ లభించేలా తన వంతు పాత్ర పోషించాలని కోరారు. సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా ఆయన ఉత్తమ గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
​ఈ సన్మాన కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సబ్బని రాజేందర్, ఫెడరేషన్ అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్ పాల్గొన్నారు. అలాగే హుజురాబాద్ డివిజన్ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్త రవీందర్, కుడికాల ప్రభాకర్, గాలి సమ్మయ్య, తాటిపాముల దేవేందర్, కేఆర్ భిక్షపతి మరియు స్థానిక సినిమా నటులు, ప్రజాసంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొని రమేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 12:
హుజురాబాద్ ముద్దుబిడ్డ సబ్బని రమేష్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం మెంబర్‌గా నియామకమవడం పట్ల పట్టణంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ పట్టణంలోని స్థానిక టాప్రా (TAAPRA) కార్యాలయంలో తెలంగాణ ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ జేఏసీ (TFTD) స్టేట్ ఆర్గనైజర్ సందేల వెంకన్న ఆధ్వర్యంలో రమేష్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సిటిజన్ ఫోరం గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హుజురాబాద్‌కు దక్కిన గౌరవం
​ఈ సందర్భంగా తెలంగాణ సిటిజన్ ఫోరం గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, TFTD అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజర్ సందేల వెంకన్న మాట్లాడుతూ.. హుజురాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ మెంబర్‌షిప్ దక్కడం స్థానికంగా ఎంతో గర్వకారణమని కొనియాడారు. రమేష్ గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలోపేతానికి, సిద్ధాంతాలకు కట్టుబడి నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. ఆయన పడిన కష్టానికి, పార్టీ పట్ల చూపిన నిబద్ధతకు గుర్తింపుగానే ఈ ఉన్నతమైన పదవి లభించిందని వారు స్పష్టం చేశారు.
​ *రాష్ట్రస్థాయిలో కీర్తి పతాకం* .
​రమేష్ నియామకం ద్వారా హుజురాబాద్ కీర్తి పతాకం రాష్ట్రస్థాయిలో ఎగిరిందని నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆయన మరింత రెట్టింపు ఉత్సాహంతో అటు పార్టీకి, ఇటు సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఫిలిం బోర్డ్ మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేష్.. సమాజానికి మేలు చేసే, సాంస్కృతిక విలువలను పెంపొందించే మంచి చిత్రాలకు ఆదరణ లభించేలా తన వంతు పాత్ర పోషించాలని కోరారు. సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా ఆయన ఉత్తమ గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
​ఈ సన్మాన కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సబ్బని రాజేందర్, ఫెడరేషన్ అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్ పాల్గొన్నారు. అలాగే హుజురాబాద్ డివిజన్ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్త రవీందర్, కుడికాల ప్రభాకర్, గాలి సమ్మయ్య, తాటిపాముల దేవేందర్, కేఆర్ భిక్షపతి మరియు స్థానిక సినిమా నటులు, ప్రజాసంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొని రమేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !